“Lesson Learned,” Anasuya On MAA Defeat ‘మా’ ఫలితాలు తారుమారుపై అనసూయ వెటకారం..

Anasuya bharadwaj suggests foul play in maa elections

Jabardast, Anasuya, Anasuya baradwaj, anasuya won maa elections, anasuya defeated in maa elections, Nagababu, Prakash raj, maa elections 2021, MAA Elections 2021, maa elections 2021 winners, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, tollywood, movies, entertainment

Anasuya Bharadwaj, who contested as an EC member in the just-concluded MAA elections, seems to doubt that cheating played out to defeat her in the elections. On Sunday, She had won the election with a huge majority as an EC member. On Monday evening, reports took a U-Turn and claimed that Anasuya was actually defeated.

‘మా’ ఫలితాలు తారుమారుపై అనసూయ వెటకారం..

Posted: 10/12/2021 05:07 PM IST
Anasuya bharadwaj suggests foul play in maa elections

భారీ అంచనాలు, పోటాపోటీ ప్రచారాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల ఫలితాలపై పలువురు వ్యక్తం చేస్తున్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ విషయాలను పక్కన బెడితే.. ముందుగా గెలిచారని ప్రచారం జరిగిన కొందరు తరువాత మాత్రం ఓఢారని ఎలా ప్రకటించారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మొత్తంగా గ్లామరస్ స్టార్లు, నటీనటలకు సంబంధించిన పోటి కాబట్టి దీనిపై సర్వత్రా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారికి కూడా ఆసక్తి కనబర్చారు. అయితే వారికి కూడా అంతుచిక్కని ప్రశ్నలు మా ఎన్నికలలో చోటుచేసుకున్నాయి.

ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో జబర్థస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ భారీ మెజారిటీతో గెలుపోందారని వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత సోమవారినికి ఫలితం ఏకంగా మారిపోయింది. అనసూయ ఓటమిపాలయ్యిందని ప్రకటించారు. దీంతో రంగమ్మత్త కూడా విస్మయానికి గురైంది. తన సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన పోస్టును పెడుతూ.. ఓ పాఠం నేర్చుకున్నానని చెప్పుకోచ్చింది. అంతేకాదు ఎన్నికల ఫలితాలపై పలు అనుమానాలను కూడా వ్యక్తం చేసింది.

ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి కార్యవర్గ సభ్యురాలిగా పోటీచేసిన ఆమె ఓటమి చెందారని ప్రకటించారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు మరో ట్వీట్ చేస్తూ.. మా ఎన్నికలలో ఉన్నవి మొత్తం 900 ఓట్లు.. అందులో పోలైనవి కేవలం 600 ఓట్లు. వాటిని లెక్కించడానికి రెండో రోజుకి ఎందుకు వాయిదా వేశారు. ఆదివారం గెలుపు అని చెప్పి ఈ రోజు ఓటమి అంటున్నారు, రాత్రికి రాత్రి ఏం జరిగింది? అని ప్రశ్నించారు. నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles