'Bigg Boss 13' winner Sidharth Shukla dies at 40 బాలీవుడ్ యువ‌ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా మృతి

Actor sidharth shukla dies of heart attack at the age of 40 tributes pour in

Sidharth ,Shukla. Siddharth Shukla, Sidharth Shukla death, Sidharth Shukla heart attack, Sidharth Shukla passed away, Sidharth Shukla death, Sidharth Shukla latest news, Sidharth Shukla Bigg Boss winner, Sidharth Shukla heart attack, Sidharth Shukla died, Sidharth Shukla family, Shehnaaz, Sana Khan, Manoj Bajpayee, Hiten Tehwani, Kapil Sharma, Ravi Kishan, Samir Soni, Bollywood, Movies, Entertainment

Bigg Boss 13 winner Sidharth Shukla died of a sudden heart attack today, September 2. Cooper Hospital, Mumbai has confirmed his death. He was 40. Hospital sources said he took some medicine before sleeping and didn't wake up. Later, the hospital confirmed that he passed away due to a heart attack.

న‌టుడు సిద్ధార్థ్ శుక్లా మృతి.. ఉల్లిక్కిపడ్డ బాలీవుడ్

Posted: 09/02/2021 02:59 PM IST
Actor sidharth shukla dies of heart attack at the age of 40 tributes pour in

బాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ప్రేక్షకులను ఎంతగానో అదరించాల్సిన యువనటుల మరణాలను అభిమానులతో పాటు సినీ పరిశ్రమ పెద్దలను, ప్రముఖులను కూడా అందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న‌టుడు సిద్ధార్థ్ శుక్లా(40) మృతి చెందాడు. ఆయ‌న ఈ రోజు ఉద‌యం ఇంట్లో గుండెపోటుకు గురికాగా, ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు కూప‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆయ‌న‌ను పరీక్షించిన వైద్యులు ఆయ‌న అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడ‌ని చెప్పారు. సిద్ధార్థ్ కు తల్లి, ఇద్దరు అక్కలు ఉన్నారు.

బుల్లితెర నటుడిగానూ సిద్ధార్థ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు. ముఖ్యంగా 'బాలికా వ‌ధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియ‌ల్ లో ఆయ‌న నటనకు మంచి పేరు వ‌చ్చింది. మొద‌ట మోడ‌లింగ్ చేసి, 2008లో బుల్లితెర న‌టుడిగా త‌న కెరీర్‌ను ప్రారంభించాడు. ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు. అనంత‌రం న‌ట‌న‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయనకు బాలీవుడ్ పరిశ్రమ నుంచి ఆపర్లు వచ్చాయి. దీంతో ఆయన హిందీ చలనచిత్ర రంగలోకి ప్ర‌వేశించాడు. 2014లో కరణ్ జొహార్ నిర్మించిన 'హంప్టీ శర్మకి దుల్హానియా' ఆయ‌న న‌టించిన తొలి చిత్రం.

సిద్ధార్థ్ శుక్లా బిగ్‌బాస్‌ సీజన్‌ 13 విజేతగానూ నిలిచాడు. బిగ్ బాస్ 13లో గెల‌వ‌డంతో ఆయ‌నకు డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచీ మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో ఆయ‌న మృతి చెంద‌డం త‌మ‌ను షాక్ కు గురి చేసిందంటూ బాలీవుడ్ ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల‌ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ శుక్లా అకాల మరణం పట్ల ఆయన స్నేహితురాలు సనఖాన్, బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్, హితెన్ తెహ్వానీ, కపిల్ శర్మ, రవికిషన్, సమీర్ సోని, అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Naga shaurya s lakshya worldwide release date is out

    రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య ‘లక్ష్య’

    Sep 27 | మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో వున్న కథలను ఎంచుకుని తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ప్రదర్శింపజేస్తున్న యువనటుడు నాగశౌర్య, కరోనా కారణంగా ఆగిన చిత్రాలను అన్నింటినీ లైన్లోపెట్టిన నాగశౌర్య వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు... Read more

  • Konda polam trailer of adventure action and determination

    ఉత్కంఠ రేపుతున్న వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

    Sep 27 | వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం కొండ‌పొలం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. మేకర్స్... Read more

  • Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

    టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

    Sep 27 | తెలుగు సినీపరిశ్రమలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. ఇవాళ ఉదయం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూయడం టాలీవుడ్... Read more

  • Sharwanand s maha samudram trailer looks intense

    ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

    Sep 24 | ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం . శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైద‌రి... Read more

  • Ram charan unveils amusing stress reliever anubhavinchu raja teaser

    రామ్ చరణ్ విడుదల చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్

    Sep 24 | రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.  ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్... Read more

Today on Telugu Wishesh