Trailer of Nani's Tuck Jagadish is high on drama and emotion ఫ్యామిలీ డ్రామాగా నాని ‘టక్ జగదీష్ ట్రైయిలర్

Tuck jagadish trailer nani promises a quintessential family drama

Tuck Jagadish, Official Trailer, Nani, Ritu Varma, Jagapathi Babu, Aishwarya Rajesh, Shiva Nirvana, Thaman S, Sahu Garapati, Harish Peddi, Shine Screens, Tollywood, Movies, Entertainment

Amazon Prime Video released the trailer of its latest Telugu offering Tuck Jagadish, which stars Nani in the lead role. The film, which is written and directed by Shiva Nirvana, will start streaming on Amazon Prime Video from September 10, coinciding with the celebration of Ganesh Chaturthi.

ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా నాని ‘టక్ జగదీష్’ ట్రైయిలర్

Posted: 09/02/2021 12:22 PM IST
Tuck jagadish trailer nani promises a quintessential family drama

న్యాచురల్ స్టార్ నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లలో రాలేకపోయింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దాదాపు అన్ని వైపుల నుంచి కథను కవర్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో లవ్.. యాక్షన్.. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

తన ఊరి బాగు కోసం .. తన కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నడుం బిగించే మంచి మనసున్న వాడిగా 'టక్ జగదీష్' కనిపిస్తున్నాడు. నాని సరసన నాయికగా రీతూ వర్మ అలరించనుండగా, నాని అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో డేనియల్ బాలాజీ కనిపిస్తున్నాడు. గతంలో నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'నిన్నుకోరి' భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా అంతకు మించిన హిట్ అవుతుందనే అంచానాలు నెలకొన్నాయి.

కాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల సంరద్భంగా హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని, తాను కూడా వారి కుటుంబసభ్యుడి లాంటివాడ్నే అని, కానీ ఇవాళ తనను పరాయివాడిగా భావించి విమర్శలు చేయడం బాధ కలిగించిందని అన్నారు. పరిస్థితులు సరిగా లేవు కాబట్టే ఓటీటీలో విడుదల చేస్తున్నామని నాని వివరణ ఇచ్చారు. అలాకాకుండా థియేటర్లలో విడుదలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, తాము ఓటీటీలో విడుదల చేస్తే అప్పుడు తనపై తానే బ్యాన్ చేసుకుంటానని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles