Naga Chaitanya-Sai Pallavi’s Love Story gets postponed విడుదల తేదీని వాయిదా వేసుకున్న ‘లవ్ స్టోరి’

Naga chaitanya and sai pallavi s love story gets postponed to release in september

Love Story, Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula, Vinayaka Chaviti release, Samantha Akkineni, Tollywood, Movies, Entertainment

Naga Chaitanya and Sai Pallavi’s Love Story gets postponed again, The rom-com was set to release in theatres on April 16, 2021. However, it was delayed due to the second wave of the novel coronavirus pandemic. Now, the film is set to hit theatres on Vinayaka Chaviti (September 10) but gets postponed again. This Romantic drama Directed by Sekhar Kammula is to release in september last week.

విడుదల తేదీని వాయిదా వేసుకున్న ‘లవ్ స్టోరీ’

Posted: 08/31/2021 06:42 PM IST
Naga chaitanya and sai pallavi s love story gets postponed to release in september

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం చక్కని రోమాంటిక్ లవ్ స్టోరిగా రూపొందుతున్న నేపథ్యంలో చిత్రంలోని పాటలు కూడా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని సారంగ దరియా పాటకు ఇప్పటికే నెట్టింట్లో విపరీతంగా హల్ చల్ చేస్తోండగా, మిగిలిన పాటలు కూడా హిట్ టాక్ తెచ్చుకుని చిత్రం విడుదలకు ముందగానే మ్యూజికల్ హిట్ అని నిరూపించుకున్నాయి. నీ చిత్రం చూసినా.. చిత్తం చదవినే చిత్తరువైతిరయ్యే అన్న పాట కూడా ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలో ఎమోషన్ పాళ్లు ఎక్కువ అంటూ చిత్రవర్గాల టాక్ వినిపించింది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతూ వచ్చింది. ఈ సినిమాను 'వినాయక చవితి' పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడుదల నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఇక వచ్చేనెల 24వ తేదీన గానీ ... 30వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే 'సారంగధరియా' పాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తిని రేపుతూనే ఉంది. దేవయాని కీలకమైన పాత్రలని పోషించిన ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రల్లో రావు రమేశ్ .. పోసాని కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles