'Seetimaarr': Saviour coach fights for the village సీటీ కొట్టించేలా వున్న గోపిచంద్ 'సీటీమార్' ట్రైలర్!

Seetimaarr trailer gopichand and tamannaah bhatia starrer promises to be a blockbuster

Seetimaarr Official Trailer, Gopichand, Tamannaah, Bhumika Chawla, Sampath Nandi, Mani Sharma, Srinivasaa Chhitturi, tollywood, Entertainment, Movies

Actor Gopichand is gearing up for the release of director Sampath Nandi’s 'Seetimaarr,' which features him in a never-seen-before avatar. The star was last seen on the big screens in 'Chanakya' that released in 2019. With just a couple of weeks left for the film's release, the makers put out the film’s trailer

సీటీ కొట్టించేలా వున్న గోపిచంద్ 'సీటీమార్' ట్రైలర్!

Posted: 08/31/2021 05:16 PM IST
Seetimaarr trailer gopichand and tamannaah bhatia starrer promises to be a blockbuster

టాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరొందిన గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, కబడ్డీ నేపథ్యంలో కొనసాగుతుంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజా ట్రైలర్ ను విడుదల చేయగా ఇది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరో రామ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సులు, డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. కబడ్డీ కోచ్ గా గోపీచంద్ ఆడపిల్లలను ప్రోత్సహించే పాత్రలో జీవించాడు.

ఒక ఊరి నుంచి ఎనమిది మంది ప్లేయర్లా.. మీకు రూల్స్ తెలుసుకదా.? అన్న ప్రశ్నకు.. రూల్స్ ప్రకారం పంపిస్తే.. ఆడివస్తారు సార్.. రూట్ లెవల్ నుంచి పంపిస్తే పేపర్లో వస్తారు అన్న గోపిచంద్ డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. త్వరలో నేషనల్ కబడ్డి వుంది. అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది. అప్పుడు మన కష్టం గురించి చెబితే దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది.. అంటూ గోపిచంద్ చెప్పిన డైలాగ్ లో ఆటను ఎంచుకున్నది గెలవడంతో పాటు తమ కష్టం గురించి చెప్పుకునేందుకని అర్థమవుతోంది. ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టల లెంగ్త్ ను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది అన్న డైలాగ్ సమకాలిన సమాజంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యల తరహాలో వున్నాయి.

కబడ్డి కోచ్ గా గోపిచంద్ ప్రోత్సాహం.. దానికి కొందరు అడ్డుకోవడం.. ఆయన ఆశయాన్ని దెబ్బతీయడానికి కొంతమంది కుట్ర చేయడం .. అలాంటివారికి తనదైన స్టైల్లో ఆయన బుద్ధి చెప్పడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇక తమన్నా గ్లామరస్ లుక్ తోను .. హీరో ఆశయసాధనలో ఒక భాగంగాను కనిపించింది. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆశయానికి అడ్డుతగిలే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో తరుణ్ అరోరా .. రావు రమేశ్ .. రెహ్మాన్ కనిపిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను భూమిక .. పోసాని .. దిగాంగన సూర్యవన్షి పోషించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles