Sridevi Soda Center: Sodala Sridevi Intro Teaser ‘సోడాల శ్రీదేవి’ ఫస్ట్ లుక్ టీజర్.. ఆనంది అదుర్స్.!

Bus stop beauty anandhi turns sodala sridevi for sudheer babu

Sridevi Soda Center, Sodaala Sridevi, Sudheer Babu, Anandhi, Karuna Kumar, Mani Sharma, 70mm Entertainments, Vijay Chilla, Shashi Devireddy, Tollywood, movies, Entertainment

Sridevi Soda Center is one of the upcoming films in Telugu. Sudheer Babu is playing the lead role. Karuna Kumar of ‘Palasa 1978’ fame is the director. The makers introduced the teaser of the film’s heroine today. Anandhi who made her debut with Maruthi’s Bus Stop is playing Sridevi in this romantic drama.

‘సోడాల శ్రీదేవి’ ఫస్ట్ లుక్ టీజర్.. ఆనంది అదుర్స్.!

Posted: 07/30/2021 09:32 PM IST
Bus stop beauty anandhi turns sodala sridevi for sudheer babu

టాలెంటెడ్ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్ క‌మ్ బ్యాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌రంగ‌ల్ భామ ప్ర‌స్తుతం సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమాలో ఫీమేల్‌ లీడ్ రోల్ లో న‌టిస్తోంది. ప‌లాస ఫేం క‌రుణకుమార్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతోందీ చిత్రం. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ నుంచి సోడా సెంట‌ర్ గ‌ర్ల్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ చిత్రంలో ఆనంది సోడాల శ్రీదేవి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్. గోలి సోడా కొడుతూ గ్రామీణ యువ‌తిగా సింపుల్ లుక్ లో అందంగా కనిపిస్తుంది ఆనంది. 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప‌లాస సినిమా తెర‌కెక్కించి మంచి హిట్టు కొట్టాడు కరుణ కుమార్. ఈ సినిమా స‌క్సెస్ తో అగ్ర నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles