'SR Kalyanamandapam' to be released on August 6 ఆగస్టు 6న విడుదలకు ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ సిద్దం

Sr kalyana mandapam trailer promising commercial entertainer

sr kalyanamandapam, kiran abbavaram, priyanka jawalkar, sr kalyana mandapam movie, sr kalyanamandapam movie songs, sr kalyanamandapam trailer, sr kalyana mandapam trailer, sr kalyana mandapam movie trailer, sr kalyanamandapam movie, sr kalyanamandapam movie making video, sr kalyana mandapam video songs, chukkala chunni song, srkalyanamandapam trailer, tollywood, movies, Entertainment

'SR Kalyanamandapam,' starring Kiran Abbavaram and Priyanka Jawalkar, is gearing up to hit the screens on August 6. The much-awaited trailer, which has been released on Wednesday, has upped the expectation levels for the film.

ఆగస్టు 6న విడుదలకు ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ సిద్దం

Posted: 07/28/2021 06:44 PM IST
Sr kalyana mandapam trailer promising commercial entertainer

తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఎమోషన్స్ తో కూడిన మరో ప్రేమకథ రూపొందింది.. ఆ సినిమా పేరే 'ఎస్.ఆర్. కల్యాణమండపం'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా ప్రియాంక జవాల్కర్ అలరించనుంది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు.

ఇది తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే కథ అని తెలుస్తోంది. అలాగే మరో వైపున తాను ఇష్టపడిన అమ్మాయి ప్రేమను పొందడానికి హీరో ఏం చేశాడనే ఆసక్తికరమైన మలుపుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో సాయికుమార్.. తల్లి పాత్రలో తులసి నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ కనిపిస్తున్నారు.

లవ్ .. యాక్షన్ ... ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను, కరోనా రెండవ దశ ముగించుకుని సినిమా ధియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో రెండో వారంలో విడుదల చేయాలని నిర్ణయించారు సినిమా యూనిట్. అంటే ఆగస్టు 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం రాయలసీయ యాసకు ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అవుతున్నారు. కాగా, నటిమణి ప్రియాంక జవాల్కర్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles