Prabhas-Nag Ashwin’s movie ‘Project K’ launched ప్రభాస్-నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్టు-కె ప్రారంభం

Prabhas amitabh bachchan to shoot for nag ashwin s sci fi film today with pooja

Rebel star Prabhas, Pan India Hero, Prabhas, Nag Ashwin, Project K, working Title, Guru Poornima, Amitabh bachchan, Deepika Padukone, Vyjanthi movies, Tollywood, Movies, Entertainment

Prabhas’ upcoming film with director Nag Ashwin launched today in Hyderabad. Now, the makers of the science fiction flick have announced that they began the production of the film, which is tentatively titled Project-K. On the special day of Guru Purnima, the movie team started with the guru of Indian cinema. They shot a scene on Amitabh Bachchan while the lead actor Prabhas had clapped for Big B.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్టు-కె ప్రారంభం

Posted: 07/24/2021 05:57 PM IST
Prabhas amitabh bachchan to shoot for nag ashwin s sci fi film today with pooja

యంగ్ రెబల్ స్టార్ స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన హీరో ప్రభాస్.. తాజాగా ఆయన మరో పాన్ ఇండియా సినిమాకు సిద్దమయ్యాడు. మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో కలసి పాన్ ఇండియా చిత్రాన్ని రూపోందిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ప్రాజెక్ట్ కె’ అంటూ వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఇవ్వాళ గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి చిత్రాన్ని ప్రారంభించారు.

వేడుకలో ప్రభాస్ తో పాటు బిగ్ బీ అమితాబ్ పాల్గొన్నారు. ముహూర్తపు షాట్ ఆయన మీదే తీశారు. కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తొలి షాట్ కు ప్రభాస్ క్లాప్ కొట్టాడు. వైజయంతీ మూవీస్ , ప్రభాస్ ఈ విషయాన్ని తెలియజేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త గెటప్ లో కనిపిస్తాడని సమాచారం. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో దీపికా పదుకొణేను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్ ప్లేను పర్యవేక్షిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles