Rashmi to play key role in Nagarjuna film?. నాగార్జున సరసన బుల్లితెర హాట్ బ్యూటీకి ఛాన్స్.!

Rashmi gautam key role in nagarjuna and praveen sattaru film

Akkineni Nagarjuna, Kajal Aggarwal, Rashmi Gautam, Praveen Sattaru, TV anchor, Actress, Rashmi gautam Nagarjuna Akkineni, Kajal Aggarwal Nagarjuna Akkineni, Guntur Talkies, Tollywood, movies, Entertainment

Now according to the latest buzz in the film industry, Rashmi Gautam has been roped in an upcoming untitled Telugu film starring King Nagarjuna, which is being helmed by Praveen Sattaru. In this film Nagarjuna will be seen sharing the screen space with Kajal Aggarwal.

నాగార్జున సరసన బుల్లితెర హాట్ బ్యూటీకి ఛాన్స్.!

Posted: 05/27/2021 01:46 PM IST
Rashmi gautam key role in nagarjuna and praveen sattaru film

బుల్లితెరపైన .. అటు వెండితెరపైన రష్మీకి మంచి క్రేజ్ ఉంది. యూత్ లో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. నాయిక ప్రధానమైన హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా చేసింది. అయితే ఆ సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఆమెకి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి.. మిగతా సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఒక వైపున సినిమాలపై దృష్టి పెడుతూనే, బుల్లితెరపై ఆమె తన జోరును కొనసాగిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా 'గోవా'లో మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మీని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Kajal Aggarwal  Rashmi Gautam  Praveen Sattaru  TV anchor  Actress  Tollywood  

Other Articles