Allu Arjun reveals Pushpa’s release date ఊరమాస్ గా అల్లు అర్జున్.. పుష్ప రిలీజ్ డేట్ లాక్

Pushpa sets release date allu arjun looks flamboyant in new poster

Allu Arjun, Pushpa release date, pushpa, Red Sandalwood Smuggler, Rashmika Mandanna, vijay sethupathi, Sukumar, arya, Allu Arjun movies, Allu Arjun latest Updates, Allu Arjun social media, Allu Arjun pushpa, Allu Arjun Sukumar, Tollywood, Movies, Entertainment

In a surprise announcement, Stylish Star Allu Arjun took to social media on Thursday morning and revealed the release date of his upcoming film ‘Pushpa.’ Helmed on a staggering budget of over Rs 100 crore, the rustic actioner will be hitting the worldwide theaters on August 13th, 2021

ఊరమాస్ గా అల్లు అర్జున్.. పుష్ప రిలీజ్ డేట్ లాక్

Posted: 01/28/2021 07:44 PM IST
Pushpa sets release date allu arjun looks flamboyant in new poster

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విభిన్నంగా కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్‌ డేట్ ను విడుదల చేసిన నాటి నుంచి ఒక్కో చిత్ర యూనిట్ తమ చిత్రాల విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాయి, ఈ క్రమంలోనే ఫుష్ప చిత్రబృందం కూడా చిత్ర విడుదలకు ముహూర్తాన్ని లాక్ చేసింది.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆగస్టు 13న ‘పుష్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. తన ట్విటర్‌ ఖాతాలో ఈ మేరకు పోస్టు పెట్టిన బన్ని.. ‘పుష్ప’ స్పెషల్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో బన్నీ స్మగ్లర్ల టీంకు నాయకుడిగా ఊరమాస్‌ గెటప్‌లో కనిపించారు. ఈ సందర్భంగా ‘2021 ఆగస్టు 13వ తేదీన ‘పుష్ప’ థియేటర్లలో విడుదల కానుందని పేర్కోన్నారు.

ఈ ఏడాది థియేటర్లలో మీ అందరినీ కలవడం కోసం నేను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాను. నేను, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌లు  మరోసారి చరిత్ర పునరావృతం చేస్తామని ఆశిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. పాన్ ఇండియన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. సుమారు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని  మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Pushpa  release date  Rashmika Mandanna  vijay sethupathi  Sukumar  arya  Tollywood  

Other Articles