RGV Coronavirus movie First Day Collections రాంగోపాల్ వర్మకు షాకిస్తున్న ‘కరోనా వైరస్’

Rgv coronavirus movie first day ap ts collections

Coronavirus, RGV coronavirus, Agastya manju coronavirus, coronavirus movie, Coronavirus Box office collections, coronavirus collections, Ram Gopal Varma, RGV movie, Agastya Manju, Tollywood, movies, entertainment

Tollywood director Ram Gopal Varma RGV's latest presentation Coronavirus, directed by Agastya Manju, which is the first film released after Lockdown session in Tollywood, last friday in a select number on big screens in the Telugu states. We have now come to come to know that the film has made a share of 2.1 lakhs on the first day.

రాంగోపాల్ వర్మకు షాకిస్తున్న ‘కరోనా వైరస్’

Posted: 12/14/2020 03:26 PM IST
Rgv coronavirus movie first day ap ts collections

'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇప్పుడు ఆ చిత్రం నిజంగానే భయపెడుతోంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా కథ సమకూర్చి, నిర్మించగా, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధియేటర్లు ప్రారంభమైన వేళ, మొట్టమొదట విడుదలైన తెలుగు సినిమా ఇదే కావడం.. అటు కరోనా భయాందోళన ఇటు చిత్రంపై పెద్దగా ఎలాంటి ప్రచారం కూడా జరగకపోవడంతో సినిమా ధీయేటర్లకు ప్రేక్షకులు అశించినంతగానే కాదు.. అరకోర కూడా రావడం లేదు.

దీంతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా వున్నాయన్న అసక్తితో మీడియా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఈ సినిమా వసూళ్ళు  అత్యంత ఘోరంగా నిలిచాయి. సినీ ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యాలకు షాకిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున కేవలం రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ మాత్రమే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వసూళ్ల తాకిడి చూస్తే కనీసం సినిమా చిత్రీకరణ సమయంలో క్యాటరింగ్ ఖర్చులు కూడా వచ్చేలా వున్నాయా.? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తన చిత్రాలకు అనునిత్యం నెగిటివ్ పబ్లిసిటీతో టాక్ వచ్చేలా చూసుకునే వర్మ.. కరోనా వైరస్ చిత్రంలో మాత్రం పాజిటివ్ అప్రోచ్ తో వెళ్లి బోల్తాపడ్డాడు.

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ ఇంట్లోని వారిని కరోనా వైరస్ ఎలా భయపెట్టిందన్న కథాంశంతో ఈ చిత్రం తయారైంది. ఈ సినిమా ప్రపంచంలోనే కరోనాపై తీసిన తొలి చిత్రమని వర్మ ఎంతగా ప్రచారం చేసుకున్నా, ఒక్కో థియేటర్ లో పదుల సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక, ఈ నెల 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రొమాంటిక్ డ్రామా 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles