Telugu actor Jayaprakash Reddy passes away at 74 నవ్వులు పండించే ఆజానుభావుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు..

Veteran actor jaya prakash reddy passes away at 74

jaya prakash reddy, jayaprakash reddy, jp reddy, jaya prakash reddy dead, jaya prakash reddy dead, jaya prakash reddy dies, jaya prakash reddy died, telugu comedian, Sarileru Neekevvaru, versatile actor, villian, heart attack, Guntur, movies, entertainment, tollywood

Telugu actor Jaya Prakash Reddy passed away early Tuesday at his residence in Guntur, Andhra Pradesh following a heart attack. He was 74. Jaya Prakash Reddy was known for his villainous and comedy roles. The versatile actor was last seen in Mahesh Babu-starrer Sarileru Neekevvaru.

నవ్వులు పండించే ఆజానుభావుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు..

Posted: 09/08/2020 10:31 AM IST
Veteran actor jaya prakash reddy passes away at 74

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. విలక్షన నటుడిగా ఎంట్రీ ఇచ్చి కమేడియన్ గా తెలుగు ప్రేక్షకులను తనదైనశైలిలో నవ్వించిన ఆరు అడుగుల ఆజానుభావుడు. సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్ రూమ్ లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్ లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు.

1946 అక్టోబర్‌ 10న జన్మించిన జయప్రకాశ్‌ రెడ్డి.. నాటకరంగస్థల నటుడు. ఇక వెండితెరకు ఆయన 1988లో విడుదలైన 'బ్రహ్మపుత్రుడు' సినిమాతో రంగ ప్రవేశం చేశారు. సినీరంగంలో విలన్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చినా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్ గా కూడా రాణించారు. కామెడీని పండించడంలో జయప్రకాశ్ రెడ్డి విభిన్నమైన ముద్రవేసి.. తెలుగు ప్రేక్షకుల చేత పోట్టచెక్కలయ్యేలా నవ్వించారు, శత్రువు, లారీ డ్రైవర్‌, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ చిత్రాల్లో నటించారు. ప్రేమించుకుందాం రా సినిమా నటుడిగా ఆయనకు చాలా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెబుతూ ఆయన చెప్పిన డైలాగ్స్‌ పాపులర్‌ అయ్యాయి.

ఆ తర్వాత వచ్చిన సమర సింహారెడ్డి ప్రతినాయకుడి పాత్రలో ఆయన తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు, ఆ తర్వాత జయం మనదేరా, నరసింహనాయుడు ఇలా వరుస చిత్రాలతో తెలుగు,తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. నటుడిగా రాణించినప్పటికీ నాటక రంగంతో ఆయన అనుబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన పలు స్టేజీలపై మోనో యాక్టింగ్‌ చేసిన అలెగ్జాండర్‌ నాటకాన్ని సినిమాగా కూడా రూపొందించారు. ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.  జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles