మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న సందర్భంగా ఆయనకు పలువురు సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మమ్ముట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్ డే డియర్ మమ్ముట్టి.. ఈ అద్భుతమైన ఇండస్ట్రీలో మీకు సహచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఇన్నేళ్లుగా సినీ పరిశ్రమకు మీరు అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. సినీ ప్రేమికులు ఎప్పటికీ వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ప్రేక్షకులను ఎప్పటికీ మీరు ఇలాగే ఉత్సాహపరుస్తూ ఉంటారని ఆశిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
దీంతో మమ్మూటీ కూడా మెగాస్టార్ చిరంజీవికి బదులిచ్చారు. తన జన్మదినం రోజున శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మమ్మూటీ సాహచర్యం పట్ల గర్విస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా మమ్ముట్టి చిరంజీవికి కృతజ్ఞతలు తెలుపుతూ.. "థాంక్యూ చిరు భాయ్! మన స్నేహాన్ని చూసుకుంటే మద్రాస్ లో గడిపిన రోజులకు వెళ్లాలి. ఎన్నో ఏళ్లు గడిచాయి, ఎన్నో జ్ఞాపకాలు... మన స్నేహం మాత్రం అలాగే ఉంది" అంటూ మమ్ముట్టి ట్విట్టర్ లో స్పందించారు.
Happy Birthday Dear @mammukka ! Proud to be your colleague in this wonderful industry.Your work over the years is a real treasure that movie lovers always relish & keep asking for more. May you continue to enthrall the audiences for many many years. ജന്മദിനാശംസകൾ !
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 7, 2020
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more