Vakeel Saab makers release motion poster వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్..

Pawan kalyan turns 49 vakeel saab makers release motion poster on actors birthday

Pawan Kalyan, Pawan Kalyan birthday, Pawan Kalyan 49th birthday, Vakeel Saab, venu sriram, ss thaman, dil raju, boney kapoor, Vakeel Saab motion poster, vakeel saab photos, vakeel saab tweets, pawan kalyan photos, pawan kalyan emotional tweets, Entertainment, telugu movies, movies, tollywood

Powerstar Pawan Kalyan is celebrating his 49th birthday today and the makers of his upcoming film, Vakeel Saab, released the motion poster as his birthday gift. With composer SS Thaman's pulsating background music, the motion poster of Vakeel Saab is a huge hit among Pawan Kalyan's fans.

మెగా అభిమానులకు పవర్ స్టార్ గిప్ట్.. ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్..

Posted: 09/02/2020 06:10 PM IST
Pawan kalyan turns 49 vakeel saab makers release motion poster on actors birthday

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు నాలుగేళ్ల తరువాత ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. సినిమాల నుంచి కొంతకాలం పాటు విరామం తీసుకున్న పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీతో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ నుంచి ఆ సినిమా యూనిట్‌ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇవాళ ఉదయం మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గాంధీజీ ఫొటోతో ప్రారంభమవుతున్న ఈ మోషన్ పోస్టర్ లో వకీల్ పాత్రలో పవన్ కల్యాణ్ నల్లకోటు, చేతిలో న్యాయ శాస్త్ర పుస్తకం, మరో చేతిలో బేస్ బాల్ స్టిక్ పట్టుకుని కనపడుతున్నారు. 

పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపోందిస్తుండగా, ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పస్ట్ లుక్ అభిమానులను అలరిస్తుండగా, తాజాగా మోషన్ పోస్టర్ తో అభిమానుల్లో చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. హిందీతో పాటు తమిళంలోనూ విడుదలై హిట్ సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులోనూ ప్రేక్షకులను అలరిస్తోందని చిత్రవర్గాలు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles