CCC Trust Helps 3rd Time To Cine Workers: Chiranjeevi కరోనా కష్టం తాత్కాలికమే.. ధైర్యం వీడద్దన్న మెగాస్టార్

10000 workers will receive ration from ccc for the 3rd time chiranjeevi

Megastar Chiranjeevi, Corona Crisis Charity, Free ration to cine workers, free groceries to cine workers, Chiranjeevi, thammareddy bharadwaja, meher ramesh, banerjee, entertainment, movies, poster boys, distribution representives, tollywood

Megastar Chiranjeevi has said on Friday that cine workers will be given free ration and groceries for the third time under the aegis of Corona Crisis Charity (CCC). Since March, thousands of workers have received similar benefits twice.

కరోనా కష్టం తాత్కాలికమే.. ధైర్యం వీడద్దన్న మెగాస్టార్ చిరంజీవి

Posted: 08/22/2020 01:11 AM IST
10000 workers will receive ration from ccc for the 3rd time chiranjeevi

క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో సంపాదన కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) వారిని ఆదుకోవడంలో ముందుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు సినీరంగంపై ఆధారపడిన చిన్న చితక ఆర్టిస్టులతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఏకంగా పది వేల మంది కార్మికులను అదుకునేందుకు సీసీసీ కూరగాయాలు, నిత్యావసర సరుకులు, బియ్యం వగైరా పంఫిణీ చేసింది. అయితే ఇప్పటికే సినీరంగం గాడిలో పడకపోవడం, సినిమాహాళ్లు తెరుచుకోకపోవడం, షూటింగ్ లు ప్రారంభం కాకపోవడంతో మరో పర్యాయం ఇవాళ నిత్యావసరాలను పంఫిణీ చేసింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. `షూటింగ్‌లు ఇంకా ప్రారంభం కాకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అందుకే సీసీసీ తరఫున మూడో సారి కూడా వారికి సహాయం చేస్తున్నాం. వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తున్నాం. ఇప్పటికే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు పదివేల మందికి అందిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులు తాత్కాలికమే. త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాం. అప్పటివరకు అందరూ ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండాల`ని చిరంజీవి ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ. కరోనా లాక్‌డౌన్ అనగానే ఏం చేద్దామని ఆలోచించి సీసీసీ ఆలోచన చిరంజీవిగారికి వచ్చింది. రెండు విడతలు అనుకున్నది మూడు అయింది. ఈ నేపథ్యంలో చిరంజీవిగారు నాలుగవ విడత కూడా ఇద్దాం అనుకున్నాం. ఈసారి రిప్రజెంటీవ్స్, పోస్టర్స్ బాయ్స్‌కి కూడా ఇచ్చాం. ఆంధ్రాలో సినిమా టెక్నిషియన్స్‌కి కూడా ఇచ్చాం. మాకు చేతనైన సాయం చేశాం. చిరంజీవి సంకల్పంతో దాతలు ముందుకురావడంతో ఈ పని సాధ్యమైంది. మెహర్ రమేశ్.. స్వయంగా ఇంటి ఇంటికి వెళ్లి సరుకుల పంపిణీ చేశారు. మెహెర్ బాబా ట్రస్ట్ వాలంటీర్లు సాయమందించడం విశేషం.

(Video Source: V6 News Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles