టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలన ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పై విమర్శలు చేశాడు. అంతే కాదు సోషల్ మీడియా వేదికగా రాజమౌళిపై సెటైర్లు కూడా వేశారు. రాజమౌళి చిత్రం అంటే ఆలస్యం అవుతుందన్న జగమెరిగిన సత్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ సెటైర్ వేశారు. అయితే రాజమౌళి చిత్రం విడుదల ఆలస్యమే కానీ.. విడుదలైన తరువాత రచ్చ.. రచ్చే అన్ని విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు ఆర్జీవి. కరోనా కాలంలో అన్ని సినిమా షూటింగులు ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి సినిమాల ఆలస్యంపై రామ్ గోపాల్ వర్మ చురకలంటిస్తూ ట్వీట్ పెట్టాడు.
‘హే రాజమౌళి ప్రపంచమంత ఆన్లైన్లోకి మారిపోయింది… అదే ప్రస్తుతం సినిమాలన్నిటికీ కొత్త మార్కెట్… ప్రస్తుతం ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి.. మేమంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని డబ్బులు ఇచ్చి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్విట్ పెట్టగా అది సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ కామెంట్ పై రాజమౌళి ఎలా స్పందిస్తారు. అసలు స్పందిస్తారో లేదో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే వర్మ తన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రూ. 25 చెల్లించి చూడాలని విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి జంటగా నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టిస్టారర్ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆలియా భట్ కూడా నటిస్తున్నారు. మెగా, ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. చలన చిత్ర పరిశ్రమ సైతం ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో తారక్ లుక్ కోసం ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళికి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more