Film actor Irrfan Khan dies in Mumbai's Kokilaben Hospital బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత..

Exceptional actor of our times india mourns irrfan khan

Actor Irrfan Khan death, actor Irrfan Khan passed away, Amitabh Bachchan, Bollywood, Irrfan Khan, irrfan khan age death, Irrfan Khan dead, Irrfan Khan death, Irrfan Khan death news, Irrfan Khan death reason, Irrfan Khan died, Irrfan Khan dies, Irrfan Khan news today, Irrfan Khan passed away, Irrfan Khan passes away, Is Irrfan Khan dead, Mini Mathur, neuroendocrine tumor, News about Irrfan Khan, Parineeti Chopra, RIP Irrfan Khan, Shekhar Kapur, Taapsee Pannu, Bollywood, Tollywood, movies, Entertainment

Ever since Irrfan Khan was diagnosed with a neuroendocrine tumour, he had left his fans in shock. He had been in London for the treatment and in September 2019, Irrfan returned to Mumbai after undergoing a successful surgery post his shoot for Angrezi Medium in London.

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత.. ప్రముఖుల దిగ్భ్రాంతి..

Posted: 04/29/2020 01:27 PM IST
Exceptional actor of our times india mourns irrfan khan

లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇకలేరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఇవాళ మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్ ఖాన్‌ అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ముంబయి నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారట. ఇర్ఫాన్‌ ఖాన్‌ను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నా.. ఆయన శరీరం చికత్సకు సహకరించకపోవడంతో ఆయన ఇవాళ కన్నముసినట్లు తెలిపారు

ఈ నేపథ్యంలో ఆయన కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేసి.. ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇండియా ట్విటర్‌ ట్రెండింగ్‌ అయినా విధి మాత్రం వక్రీకరించింది. అయనను అనంతవాయువులలో ఐక్యం చేసింది. 2018 మార్చిలో తన అనారోగ్య పరిస్థితిపై తొలిసారిగా ప్రకటన చేసి అభిమానులను షాక్‌కు గురిచేశారు. శనివారం రాజస్థాన్‌లోని జయపురలో ఇర్ఫాన్‌ తల్లి సయీదా బేగం(95) మృతి చెందారు. లాక్ డౌన్‌ కారణంగా ముంబయిలోనే చిక్కుకుపోయిన ఆయన‌ తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయారు.

ఇర్ఫాన్‌ గతంలో యూకేలో క్యాన్సర్ కు చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఇండియాకు వచ్చిన ఇర్ఫాన్‌ ఇటీవల ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించారు. అనారోగ్యం కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇర్ఫాన్‌ పాల్గొనలేదు. ‘అంగ్రేజీ మీడియం’ తర్వాత ఆయన ఏ సినిమాకి సంతకం చేయలేదు. నిన్న మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఇర్ఫాన్‌ తుదిశ్వాస విడిచారు. తెలుగులో సైనికుడు చిత్రంలో ఇర్ఫాన్‌ నటించి మెప్పించారు. 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

కాగా ఇర్ఫాన్ ఖాన్ మరణంతో బాలీవుడ్ లో విషాధఛాయలు అలుముకున్నాయి. ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నటీనటులు ప్రియాంక చోప్రా, తాప్సీ పొన్ను, మిని మాథుర్, కరన్ జోహార్, అనుష్క వర్మ, పరిణితి చోప్రా, శేఖర్ కపూర్ సహా పలువురు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, ఇర్ఫాన్ కుటుంబసభ్యులకు నటీనటులు తమ తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించాల్సిన నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles