Actor Irrfan Khan Admitted To Mumbai's Kokilaben Hospital బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరోగ్యం విషమం..

Actor irrfan khan admitted to mumbai s kokilaben hospital under observation in icu

Irrfan Khan, Kokilaben, Irrfan Khan Neuroendocrine Tumour, Irrfan Khan Cancer, Irrfan Khan Hospital, Bollywood, Tollywood, movies, Entertainment

Ever since Irrfan Khan was diagnosed with a neuroendocrine tumour, he had left his fans in shock. He had been in London for the treatment and in September 2019, Irrfan returned to Mumbai after undergoing a successful surgery post his shoot for Angrezi Medium in London.

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరోగ్యం విషమం..

Posted: 04/28/2020 09:29 PM IST
Actor irrfan khan admitted to mumbai s kokilaben hospital under observation in icu

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ముంబయి నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారట. ఇర్ఫాన్‌ ఖాన్‌ను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పలు ఆంగ్ల వెబ్‌సైట్లు కథనం రాశాయి. ఈ నేపథ్యంలో ఆయన కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇండియా ట్విటర్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.

గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్‌ అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2018 మార్చిలో ఆయన తన అనారోగ్య పరిస్థితి గురించి ప్రకటించి, అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఆపై యూకేలో చికిత్స చేయించుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలో నటించారు. మార్చిలో విడుదలైన ఈ సినిమా కరోనా నేపథ్యంలో బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ తర్వాత ఇర్ఫాన్‌‌ కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles