Allu Arjun Celebrates Personal Assistant's Birthday అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెట్ జనులు..

Allu arjun makes sweet gesture celebrates his personal assistant s birthday

Allu Arjun, Rashmika Mandanna, Sukumar, red sandal, shive, personal assistant, coronavirus, covid-19, lockdown, covid-19 lockdown, corona lockdown, tollywood, movies, entertainment

A series of pictures have gone viral on social media where superstar Allu Arjun is seen clapping as his personal assistant cuts the cake. Joining the celebration is Allu Arjun's son Allu Ayaan.

అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెట్ జనులు..

Posted: 04/15/2020 08:42 PM IST
Allu arjun makes sweet gesture celebrates his personal assistant s birthday

అల వైకుంఠపురం చిత్రంతో టాలీవుడ్ లోనే నాన్ బాహుబలి చిత్రాలలో రికార్డులను అధిగమించి తన పేరున లిఖించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఓన్లీ రాకార్డులనే కాదు.. తన వారి హృదయాలను కూడా గెలుచుకోవడంలో అగ్రగన్యుడు. తాజాగా ఆల్లు అర్జున్ తన మససు ఎంత మంచిదో చాటుకున్న ఘటన ఇది. ఇక ఈ మంచి పనికి నెటిజన్ల నుండి భారీగా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బన్నీ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసే శివ అనే కుర్రాడి పుట్టినరోజుని బన్నీ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశాడు.

అతని కోసం తన ఇంట్లోనే కేక్‌ను తయారు చేయించడం విశేషం. కొడుకు అయాన్‌తో కలిసి దగ్గరుండి శివతో కేక్ కట్ చేయించాడు స్టైలిష్ స్టార్. బన్నీ చేసిన Special Arrangements చూసి శివ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. షార్ట్‌తో కొత్త సినిమా కోసం తయారవుతున్న న్యూ లుక్‌లో బన్నీ బాగున్నాడు. ఇటీవల తన పర్సనల్ బాడీగార్డు పుట్టినరోజును కూడా దగ్గరుండి సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘పుష్ప’ చిత్రం కొత్త షెడ్యల్ త్వరలో స్టార్ట్ కానుంది. బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Rashmika Mandanna  Sukumar  red sandal  shive  personal assistant  coronavirus  covid-19  lockdown  tollywood  

Other Articles