Nikhila Vimal helps out at Kannur corona call centre రియల్లీ బ్యూటీఫుల్ హీరోయిన్ అంటే ఈ నటే..

Karthi s heroine works in call center to help corona relief

Nikhila Vimal, arts and culture, coronavirus, call center, kannur, essential commodities, volunteer, really beautiful, Lockdown, Malayalam Movies News, Mollywood News,Nikhila Vimal,Covid 19 help desk Kerala,Nikhila Vimal actress,lockdown meassures,covid 19,Corona Call Centre,actress Nikhila, mollywood, movies, entertainment, Tollywood

Mollywood actress Nikhila Vimal found some time to serve the public by working at the district panchayat’s call centre in Kannur. The actress worked at the call centre which is being operated to coordinate the supply of essential commodities to houses amid the lockdown over coronavirus outbreak.

రియల్లీ బ్యూటీఫుల్ హీరోయిన్ అంటే ఈ నటే..

Posted: 04/15/2020 06:38 PM IST
Karthi s heroine works in call center to help corona relief

రామాయణంలోని సుందరాకాండలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణను సాగిస్తూ.. లంకాధిపతి దశకంఠుడైన రావణాసురుడ్ని శయనమందిరంలో పరున్న పరకాంతలను చూసి ఆ తరువాత మండోదరిని చూసినంత హనుమ.. అమెను సీత అని భావించిన సంతోషపడి.. ఆ వెంటనే చింతించి.. ఆతరువాత సీతాదేవిని చూసిన పిమ్మట సీతాదేవి ఎంతటి సౌందర్యవతి అన్న విషయాన్ని విశ్లేషించడం.. దుమ్ముపట్టిన చీరలో.. అమె కన్నీళ్లు ఇంకిన వస్త్రంలో తన భర్తను తలచుకుని విలపించే సీతమ్మను చూసిన హనుమలో కలిగిన భావాలను వివరిస్తారు వాల్మీకి మహర్షి. సౌందర్యమంటే బాహ్యసౌందర్యం కాదని, సేవాగుణం, అంతర్సౌందర్యం గురించి కవులు విశ్లేషణ సాగుతుంది.

ఇప్పుడీ అంశం ఎందుకంటారా.? నిజమే హీరోయిన్ కావాలంటే.. అందం కావాలి. కానీ నిజమైన హీరోయిన్ కావాలంటే అందంతో పాటు అంతర్ సౌందర్యం కూడా కావాలి. మిమత్ని ఎవరైనా చూసి 'You are Beautiful.. Inside' అని చెప్పుకోగలగాలి. ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఈ హీరోయిన్‌కి.. దక్షిణాదిలో తమిళ, మళయాలం సినిమాల్లో స్టార్ హీరోయిన్ నిఖిలా విమల్. సామాజిక కార్యక్రమాలు అంటే ఎప్పుడూ ముందు ఉండే ఈ అమ్మడు కరోనా కాలంలో కూడా కేరళలో తనవంతు సహాయం ఆ రాష్ట్రప్రభుత్వానికి అందిస్తుంది. కరోనా వైరస్‌ దేశంలో రోజు రోజుకు విస్తరిస్తుండగా.. వీటిని అరికట్టడానికి కేంద్రం మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించింది.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా విరాళాలు అందజేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేస్తుండగా  నిఖిలా రామన్.. నిత్యావసరాలు, మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న  ప్రజల కోసం కేరళ ప్రభుత్వం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా.. అందులో పనిచేస్తూ..ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తోంది. హీరొయిన్ వాలంటీర్‌గా పనిచేసేందుకు ముందుకు రావడంతో ఆ రాష్ట్రంలో చాలా మంది అమ్మాయిలు వాలంటీర్‌గా ముందుకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈమె తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన మేడ మీద అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమిళ, మలయాళం సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles