Actor Zoa Morani Tests Positive For Coronavirus నటి జోయా మోరానీకి కరోనా పాజిటివ్.. అక్క బాటలోనే..

After sister shaza zoa morani also tests positive for covid 19

covid-19, Zoa Morani, Shaza Morani, Karim Morani, CoronaVirus, Positive, Bollywood, coronavirus, Corona, bollywood, tollywood, movies, entertainment

Bollywood producer Karim Morani‘s daughter and actress Zoa Morani was also tested positive for the virus. Previously, her sister Shaza Morani was tested positive after she returned from a trip to Sri Lanka. Zoa had returned from Rajasthan mid-march and was also tested positive and is admitted at the Kokilaben Dhirubhai Ambani Hospital.

నటి జోయా మోరానీకి కరోనా పాజిటివ్.. అక్క బాటలోనే..

Posted: 04/07/2020 10:35 PM IST
After sister shaza zoa morani also tests positive for covid 19

బాలీవుడ్ గాయని కనికా కపూర్.. ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడగానే అటు బాలీవుడ్ నిర్మాత కరీమ్ మోరానీ తనయ షాజా మోరానీకి ఈ వైరస్ సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో అమెకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే కరీమ్ మోరానీ రెండో కూతురు, నటి జోయా మోరానీకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మార్చి మధ్యలో జోయా రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చింది. తన అక్కతో పాటు జోయా కూడా టెస్ట్ చేయించుకుంది.

అయితే ఆమె రిపోర్టులు కొంచెం ఆలస్యంగా వచ్చాయి. ఈ పరీక్షలో జోయాకు పాజిటివ్ అని తేలింది. జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె అక్క ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వీరి తల్లిదండ్రులు (కరీమ్ మోరానీ దంపతులు) కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే, వీరి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్'ను కరీమ్ మోరానీ నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid-19  Zoa Morani  Shaza Morani  Karim Morani  CoronaVirus  Positive  Bollywood  coronavirus  Corona  bollywood  tollywood  

Other Articles