కరోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో తన వంతు బాధ్యతగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మొత్తంలో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మరో 25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించారు అల్లు అర్జున్. కేరళ వరదల్లో చిక్కుకున్నప్పుడు 25 లక్షలు, చెన్నై వరదలు వచ్చిప్పడు 25 లక్షల విరాళాలు అల్లు అర్జున్ అందించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రుల ఆదేశాలు మేరకు 21 రోజులు లాక్‌డౌన్‌ని మనందరం కచ్చితంగా పాటిద్దాం. మనకోసం ఎలాంటి ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, అలానే కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న నా అభిమానులతో పాటు ప్రజలంతా ఇల్లకే పరితమై కరోనా నివారణకు ప్రభుత్వానికి సహకరించి, ఈ ఘోర విపత్తు నుంచి అందరం బయటపడాలని’’ అన్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరకుల కోసం కేటాయించిన సడలింపు సమయంలో బన్నీ తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్‌లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లవ్స్ ధరించి సూపర్ మార్కెట్‌లో తనకు కావాల్సిన వస్తువులును కొనుక్కుని సాదాసీదాగా వెళ్లిపోయాడు. అయితే బన్నీ సూపర్ మార్కెట్‌లో సాధారణ వ్యక్తిగా వస్తువులు కొంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్టైలిష్ స్టార్ సింప్లిసిటీకి అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more