దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చారు. నిర్ధేశించిన సమయం కన్నా కాసింత ఆలస్యంగా విడుదల చేసినా.. మెగా అభిమానులు నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల సార్లు దానిని చూసారు. చరణ్ పుట్టినరోజున విడుదలైన ఈ సర్ ప్రైజ్ మెగాపవర్ స్టార్ అభిమానుల నీరిక్షణకు కన్నుల పండువగా మార్చింది.
‘‘రౌద్రం రణం రుధిరం’’.. కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇందులో రాంచరణ్ పాత్రను ఎన్టీఆర్ పరిచయం చేస్తండగా, చెరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. సీతారామ రాజుగా చరణ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్లో ఫైర్.. అచ్చుగుద్దినట్టు దిగిపోయాడు. సెంథిల్ కుమార్ విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ కొమరం భీం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ రొమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.
‘ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’.. అంటూ తారక్ మాడ్యులేషన్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. సర్ ప్రైజ్ పేరుతో రాంచరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో రాకింగ్ అంటూ నెట్ జనులు కూడా కామెంట్లు పెడుతున్నారు. బాహుబలితో దేశవ్యాప్తంగా సత్తా చాటిన జక్కన్న మరోమారు ‘RRR’తో తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచ సినీ ప్రేక్షకులకు చూపించబోతున్నాడని గర్వంగా ఫీలవచ్చు.. ఫిక్స్ అవచ్చు..
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more