PSPK26 – Pawan Kalyan Wakeel Saab Poster పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ ఇదిగో..

Pspk26 first look pawan kalyan steals the show as vakeel saab

Pawan Kalyan, Vakeel saab, pawan kalyan first look vakeel saab, pawan kalyan vakeel saab, pspk 26, pink remake, pink, Nivetha Thomas, nerkonda paarvai, Venu Sriram, #pspk26, movies, entertainment, tollywood

Presenting herewith the first look poster of the film 'Vakeel Saab'. Power Star Pawan Kalyan has been making his re-entry with this film after three years. The film is the official remake of Bollywood blockbuster 'Pink'.

పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్.. టైటిల్ ఇదిగో.

Posted: 03/02/2020 07:16 PM IST
Pspk26 first look pawan kalyan steals the show as vakeel saab

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తతో సంబరపడిన ఫ్యాన్స్.. మార్చి 2 ఎప్పుడు వస్తుందా.? అని రోజుటుగా వేచిచూస్తున్నారు. అందుకు కారణం ఆయన తాజా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందనే. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఆ శుభగడియ వచ్చేసింది. పవన్ కల్యాణ్ తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లో విడుదలవుతుందన్న విషయం తెలిసిందే.

ఇక పవన్ కల్యాణ్ తాజా సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ని నిర్ణయిస్తూ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక పోస్టర్ ని రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్ తో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాసేపటి క్రితం అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రావడంతో ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్, దానిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ చస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తో పాటు అంజలి, నివేత థామస్, అనన్య ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎస్.ఎస్ థమన్ సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన తొలి సాంగ్ ని అతి త్వరలో రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఒక ఫైట్ ఉంటాయని, సినిమా కథ, కథనాలను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొంత మార్పులు చేర్పులు చేసి దర్శకుడు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నట్లు టాక్. మొత్తానికి ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత నేడు రిలీజ్ అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, పవన్ ఫ్యాన్స్ లో అమితానందాన్ని నింపిందని చెప్పాలి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని మే నెల రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దిల్ రాజు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles