Nithin gets engaged to Shalini పెళ్లి పనులకు మ్యూజిక్ అన్.. ఫ్యాన్స్ తో నితిన్

Hero nithin and shalini engagement pelli panulu started

Hero Nithin, Nithin Engaged, Shalini, Nithin Fiance, Nithin Pre-Wedding, Nithin Shalini Engagement, Nithin engagement photos, nithin shalini engagement gallery, Nithin Marriage, valentines day, Tollywood, Tollywood, movies, entertainment

Young hero Nithin who enjoyed a wonderful most eligible bachelor status all these years is finally turning into a family man. After falling head over heels with MBA graduate Shalini Reddy, and the couple is tying the knot soon.

పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

Posted: 02/15/2020 06:55 PM IST
Hero nithin and shalini engagement pelli panulu started

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని అనే యువతితో ప్రేమలో పడ్డారని, ఆమెను త్వరలోనే పరియణం చేసుకోబోతున్నాడని వచ్చిన వార్తలు నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే ఈ వార్తను నిజమని చెప్పింది యంగ్ హీరో నితినే కాబట్టి.

ఇప్పటికే షాలినితో నిశ్చితార్థం చేసుకున్న యంగ్ హీరో.. ఏప్రిల్‌లో అమెను అర్థాంగిగా చేసుకోబోతున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 15న) నితిన్ నిశ్చితార్థం షాలినితో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 14 వాలైంటెన్స్ డే నాడు సింగిల్ యాంథెమ్ పాడుకున్న ‘భీష్మ’ ఆ మర్నాడే పెళ్లికి రెడీ అయిపోయాడు. నితిన్ గతకొంత కాలంగా తన స్నేహితురాలు షాలినీతో ప్రేమలో ఉన్నాడు. కామన్ ఫ్రెండ్ వల్ల ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.

ఇరు కుటుంబాలవారి రిలేటివ్స్‌తో పాటు స్నేహితుల నడుమ ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘పెళ్లిపనులు ఆరంభం.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’’.. అంటూ ట్వీట్ చేశాడు నితిన్. ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నితిన్, షాలినీల వివాహ వేడుక నిర్వహించబోతున్నారు.  సినిమాల విషయానికొస్తే.. నితిన్, రష్మికతో నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, సిినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles