Vijay Deverakonda’s ‘World Famous Lover’ trailer ‘‘జిందగీ ఏమన్నా కమ్మగుందా మామా..’’

World famous lover trailer is out vijay deverakonda will make you feel the pain literally

World famous lover trailer, world famous lover movie trailer, WFL trailer, WFL movie trailer, vijay devarakonda new movie trailer, world famous lover movie, world famous lover on valentines day, vijay devarakonda, raashi khanna, aishwarya rajesh, catherine tresa, kranthi madhav, Tollywood, movies, entertainment

World Famous Lover trailer starring Vijay Deverakonda is finally out and as we expected it is outstanding. The trailer shows the life Gautham played by Vijay in four different parts. Every part of his life is filled with passionate love which ends up with the bitter heartbreak.

‘‘మీ ఇంట్ల కొట్టుకోరా.. భార్యభర్తలు కొట్టుకోరా..’’

Posted: 02/06/2020 08:15 PM IST
World famous lover trailer is out vijay deverakonda will make you feel the pain literally

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైయిలర్ ఇవాళ విడుదలైంది.

విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రాశీ ఖన్నా, ఎజబెల్లా, క్యాథరీన్‌లతో తన స్టైల్‌లో రొమాన్స్ చేస్తూనే ఇష్టంలేని భార్యతో కాపురం చేసే భర్తగా కనిపించాడు. ‘ఈ ప్రపంచంలో నిస్వార్థమైంది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు ఐ వాటెండ్ టు బి దిజ్ వరల్డ్ ఫేమస్ లవర్’ ‘వేర్ యు బార్న్ బ్యూటిఫుల్ అర్ యు గ్రో అప్ టు బి బ్యూటిఫుల్’ ‘మీ అడోళ్లకు అస్సలు అగదానే.. బట్ట కొంటె వంటి మీద ఏసుడేనా..’ అంటూ తన ప్రేమలోనే కాదు తన బాషలోనూ రొమాంటిక్ గా నాలుగు వేరియేషన్స్ చూపించాడు విజయ్.

అదే సమయంలో ప్రేమ విఫలమైనవాడిగా, లేక ప్రేమలో గాయపడ్డవాడిగా కూడా వేరియేషన్స్ చూపుతూ అద్భుత నటనను ప్రదర్శించాడు విజయ్. ‘ఆర్ యు మ్యాడ్ పెళ్లంటే జోకా.? నీ అవ్వ తంతే కిటికిల పడ్తవ్ మరి.. నా ముక్కు, మూతి, తోలు మారిపోయిందా.? మీ ఇంట్ల కొట్టుకోరా.. భార్యభర్తలు కొట్టుకోరా.? నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెల్వకుండా ఉండాలంటే.. బేసికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలే.. నౌ ఐ లిటరల్లీ ఫీల్ ద పెయిన్’ అంటూ తనలోని బాధను చాలా అవేదనాభరితంగా వ్యక్తపర్చాడు.

ఐశ్వర్య రాజేష్ డీ గ్లామర్ రోల్‌‌లో సహజంగా కనిపించగా.. ‘జిందగి ఏమన్న కమ్మగుందా మామ..’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. పెళ్లికిముందు రాశీ ఖన్నా, ఎజబెల్లాలతో ప్రేమాయణం నడిపిన విజయ్, పెళ్లి తర్వాత కేథరిన్‌తో ప్రేమలో పడతాడని తెలుస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన బొగ్గుగని మణిరా అన్న పాటతో పాటు ట్రైలర్ లోని ఆర్ఆర్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • I am glad that god has chosen me for this work sonu sood

  మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

  Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

 • Priyamani is comrade bharathakka in virata parvam

  విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

  Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

 • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

  నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

  Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

 • Samantha strong reply to haters goes viral on social media

  విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

  May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

 • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

  ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

  May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh