Sudheer Babu as the sa'V'iour ‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

Rakshakudu from v comes as a saviour

Sudheer Babu, V Movie, Rakshasudu, Indraganti Mohanakrishna, Nani, Aditi Rao Hydari, Nivetha Thomas, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates, movies, Entertainment, tollywood

The makers of the Telugu action thriller ‘V’, unveiled the first look poster of Sudheer Babu from the film that also stars Nani, Aditi Rao Hydari and Nivetha Thomas

‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

Posted: 01/27/2020 09:14 PM IST
Rakshakudu from v comes as a saviour

టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ బాబు గత కొంతకాలంగా తన నటనను నిరూపించుకుని ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడు. తాజాగా ఆ అవకాశం ఆయనకు లభించినట్టే వుంది. ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న 'వి' సినిమాలో ఆయనకు ఈ అవకాశం లభ్యమౌతుందనే అంటున్నాయి చిత్రవర్గాలు. ఇంద్రగటి సినిమా అంటేనే ఒక కొత్తదనానికి నిదర్శనం. అలాంటి దర్శకుడి చిత్రంలో సినిమా రూపొందుతోందంటనే ప్రేక్షకులలో అంచానలు పెరుగుతాయి.

ఈ తాజాగా వస్తున్న ఇంద్రగంటి చిత్రంలో న్యాచురల్ స్టార్ నానితో పాటుగా సుధీర్ బాబు కూడా ప్రధానమైన పాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఇదో మల్టీస్టారర్ చిత్రంగా వుండబోతోంది. తెలుగు వెండితెరపై తాజాగా మల్టీస్టారర్ చిత్రాలు విజయాలను అందుకుంటున్న క్రమంలో ఇంద్రగంటి కూడా చక్కని మల్టీ స్టారర్ ను రూపోందిస్తున్నారని చిత్రపురి వర్గాల సమాచారం, కాగా, ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజున సుధీర్ బాబు ఫస్టులుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. యనున్నట్టు ముందుగానే చెప్పారు.

'గన్' తో గురిపెట్టిన సుధీర్ బాబు సీరియస్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సుధీర్ బాబు లుక్ డిఫరెంట్ గా వుంది. రేపు నాని ఫస్టులుక్ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రక్షకుడుగా సుధీర్ బాబు .. రాక్షసుడు మనస్తత్వం కలిగిన పాత్రలో నాని చేస్తున్నట్టు ఇంతకుముందే చెప్పారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా నివేదా థామస్ .. అదితీరావు కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles