Slow And Melodious 'Pranam' From 'Jaanu'! శర్వానంద్, సమంత ‘జాను’ నుంచి ఆకట్టుకునే పాట.!

Jaanu s first single pranam samantha akkineni and sharwanand s song is a soulful melody

samantha akkineni, sharwanand, jaanu, jaanu first single, jaanu lyrical song, 96 telugu remake, prem kumar, dil raju, jaanu first look, 96 telugu remake, samantha, samantha jaanu, samantha akkineni jaanu, jannu, Tollywood, movies, entertainment

Young hero Sharwanand and Samantha Akkineni’s upcoming film ‘Jaanu’, a remake of ’96’ got decent buzz with its teaser which released a few weeks ago. Now, the team released the first single ‘Pranam’ from the album composed by Govind Vasantha.

శర్వానంద్, సమంత ‘జాను’ నుంచి ఆకట్టుకునే పాట.!

Posted: 01/21/2020 05:53 PM IST
Jaanu s first single pranam samantha akkineni and sharwanand s song is a soulful melody

శర్వానంద్‌, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ నుంచి ఇటీవలే శర్వానంద్ ఫస్ట్ లుక్.. ఆ వెంటనే చిత్రానికి సంబంధించిన టీజర్ రాగా, తాజాగా, ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ప్రాణం, నా ప్రాణం.. నీతో ఇలా.. గానం, తొలి గానం.. పాడే వేళ.. మన దూరమే అమావాస్యలే చెరో కథై ఇలా..’ అంటూ మెలోడీగా సాగిన గీతం శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. చిన్మయి, గౌతమ్‌ భరద్వాజ్‌ ఈ పాటను ఆలపించారు.

తమిళ హిట్‌ ‘96’కి తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. రాజు, శిరీష్‌ నిర్మాతలు. పాఠశాలలో ఇష్టపడ్డ జంట అనేక ఏళ్ల తర్వాత మళ్లీ కలిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో దీన్ని రూపొందించారు. తమిళ చిత్రం భారీ విజయం సాధించడంతో తెలుగు సినిమాపై మంచి అంచనాల నెలకొన్నాయి. విజయ్‌ సేతుపతి, త్రిష తమిళంలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులలో సర్వాత్రా అసక్తి నెలకొంది.

గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చారు. ఈ వీడియోను సమంత సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. విద్యార్థి దశలో ఏర్పడిన ప్రేమ.. యుక్తవయస్సుకు వచ్చిన తరువాత ఎలా మారింది.. విడిపోయిన ప్రేమికులను కలిపే తరుణంలో ఆ మాటలకున్న బలం.. వాటి వెనుక దాగిన భావోద్వేగం.. పాటలోని చరణాల్లో వినిపించడంతో.. ఈ శ్రావ్యానందంగా సాగే పాట ప్రమికులను, యవతను ఒక చక్కని ఫీల్ ను తీసుకువస్తొంది. ఈ చిత్రానికి తమిళంలో రూపోందించిన ప్రేమ్ కుమార్‌ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles