Sarileru Neekevvaru film Crosses 200 crore worldwide రూ.200 కోట్ల క్లబ్ లోకి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’.!

Sarileru neekevvaru box office collection mahesh babu s film crosses 200 crore worldwide

Anil Sunkara, dil raju, mahesh babu, Tamannaah, rashmika mandanna, Sarileru Neekevvaru, Rs 200 crore club, Sarileru Neekevvaru Box Office Collections, Sarileru Neekevvaru gross collections, Sarileru Neekevvaru telugu states collections, Vijayashanti, Prakash Raj, Anil ravipudi, DSP tollywood, movies, entertainment

Sarileru Neekevvaru, which sends a powerful message to the audience about the Indian army, is also minting big numbers at the ticket windows. The much-talked-about the film has set a huge record by becoming the first Telugu film to earn Rs 100 crore club alone in Telugu states.

రూ.200 కోట్ల క్లబ్ లోకి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’.!

Posted: 01/21/2020 04:53 PM IST
Sarileru neekevvaru box office collection mahesh babu s film crosses 200 crore worldwide

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ పది రోజుల వ్యవధిలో రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరి బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. జనవరి 11న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల కంటే అధికంగా వసూళ్లను రాబట్టిందని, బొమ్మ దద్దరిల్లిందని కామెంట్లు చేశారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో.. మహేష్ నిర్మాతల్లో ఒకరిగా మారి ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసింది.

అయితే నిర్మాతల అంచానాలను ఎక్కడా తక్కువ కాకుండా సినిమా ఓ రేంజ్ లో బాక్సాఫీసు వద్ద సవ్వడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం పదిరోజుల వ్యవధిలో రూ.101.97 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు చెప్పారు. నైజాంలో రూ.33 కోట్లు, సీడెడ్‌లో రూ.14.65 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ.17.07 కోట్లు, గుంటూరులో రూ.9.03 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.10.06 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6.57 కోట్లు, కృష్ణలో రూ.7.97 కోట్లు, నెల్లూరులో రూ.3.62 కోట్లు సాధించినట్లు అంచనా వేశారు.

చిత్రం అంచనాలను మించి రాణించిన సందర్భంగా చిత్ర బృందం కొత్త ప్రోమోను విడుదల చేసింది. ‘ఎవడ్ని ఎవడు వదలాలిరా..’ అంటూ మహేశ్‌ కొండారెడ్డి బురుజు వద్ద విలన్లను చిత్తు చేస్తున్న సన్నివేశాన్ని వీడియోలో చూపించారు. పావుగంట నుంచి నన్ను నరకడానికి ఎత్తని చేయి లేదు వాడని కత్తి లేదు.. మందలు మందలుగా మీదకొచ్చానా.. చుక్క చమట పట్టలేదు.. నా చోక్కా గుండీ ఊడలేదు.. ఎవడు ఎవడ్ని వదలాలి.? అంటూ వీరావేశంలో చెబుతున్న డైలాగ్ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles