Megastar and Rebelstar in a single frame రెబల్ స్టార్ కృష్ణంరాజుకు శుభాకాంక్షల వెల్లువ

Happy birthday krishnam raju prabhas family celebrate his uncle s birthday

Krishnam Raju's birthday bash, Krishnam Raju, 80th birthday, Manchu Mohan Babu, Chiranjeevi, Manchu Manoj, Prabhas, Grand party, Actor-politician Krishnam Raju, tollywood, movies, Entertainment

Actor-politician Krishnam Raju celebrates his 80th birthday today and to bring in the special day, he hosted a big party at his residence last night. Megastar Chiranjeevi, Prabhas, Mohan Babu, Lakshmi Manchu, Vishnu Manchu and others hosted a small a party for Krishnam Raju's birthday.

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు శుభాకాంక్షల వెల్లువ

Posted: 01/20/2020 06:45 PM IST
Happy birthday krishnam raju prabhas family celebrate his uncle s birthday

రెబల్ స్టార్‌ కృష్ణంరాజు 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. రెబల్ స్టార్ గా వెండితెరపై వెలిగి తనదైన ప్రత్యేకతతో అప్పట్లోనే యాంగ్రీ యంగ్ మాన్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. కటకటాల రుద్రయ్య, తిరుగుబాటు, భారతంలోశంఖారావం, పునాదిరాళ్లు సహా పలు చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు కృష్ణంరాజు. ఇవాళ ఆయన 80వ పుట్టినరోజును పురస్కరించుకుని క్రితం రోజు రాత్రి కుటుంబసభ్యులు ఆయన కోసం పార్టీని ఏర్పాటు చేశారు.

ఈ పార్టీలో కుటుంబసభ్యులతో పాటు పలువురు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కుర్తాలో, కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెబల్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోహన్‌బాబు ఆయనకు కేక్ తినిపించారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా కృష్ణం రాజుకు కేక్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు తదితరులు పార్టీకి హాజరై, కృష్ణంరాజుకు శుభాకాంక్షలు చెప్పారు.

చిరు, మెహన్ బాబుతో డార్లింగ్ ప్రభాస్ చాలా చనువుగా కనిపించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంచు కుటుంబ సభ్యులు పార్టీలో తీసుకున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా కృష్ణం రాజు తన సోదరీమణులతో కలిసి ప్రభాస్‌ దిగిన ఫ్యామిలీ ఫొటో కూడా వైరల్ గా మారింది. కాగా, ప్రభాస్ ప్రస్తుతం జాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnam Raju  birthday  Manchu Mohan Babu  Chiranjeevi  Manchu Manoj  Prabhas  Grand party  tollywood  

Other Articles