అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్దంగా వుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇవాళ చిట్టచివరిదైన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు బదులు మ్యూజికల్ కన్సార్ట్ ను నిర్వహించింది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ చిత్రంపై విడుదల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమతులకు విరుద్దంగా టైం ముగిసిన తర్వాత కూడా ఈవెంట్ నిర్వహించడంతో పాటు మ్యూజికల్ నైట్ కు 5 నుంచి 6 వేల మంది మాత్రమే హాజరు అవుతారని.. చెప్పి ఏకంగా 15 వేల మందికి పాస్ లను ఇవ్వడంతో ఈవెంట్ నిర్వహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6న నిర్వహించిన ఈ ఈవెంట్ ను రాత్రి 10 గంటలలోపే ముగుస్తామని అనుమతి పోందిన శ్రేయాస్ మీడియా.. రాత్రి 11.30 వరకు కొనసాగించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితిని నియంత్రిచలేక తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్ని-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ స్వరాలు అందించిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టబు, నివేదా పేతురాజు, సుశాంత్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, సునీల్, నవదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకంపై, ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు నిర్మిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more