నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా!’ చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ల జోరును పెంచేసింది. తాజాగా ఇవాళ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. కుటుంబ నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో యాక్షన్‌ను సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత లాంగ్ లెన్త్ పాత్రలో చేస్తున్నారు. రాజీవ్ కనకాల ఈ సినిమాలో విలన్ చేస్తున్నారు. ట్రైలర్ కళ్యాణ్ రామ్ చేప్పే డైలాగ్స్ పేలుతున్నాయి.
ఎదురుతిరిగేవాడు రానంత వరకే రా.. భయపెట్టేవాడు రాజు అంటూ చెప్పే డైలాగ్ బాగుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ నెల 15 న విడుదల చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more