Mathu Vadalara' proves content is the king ‘మత్తు వదలరా’ నుంచి మరో కొత్త ట్రైలర్

Mathu vadalara gets new trailer after the release

Mathu Vadalara, Simha, Telugu, Tollywood, SS Rajamouli, KK Keeravani, SS Rajamouli, Prabhas, Tollywood, movies, Entertainment

Directed by Ritesh Rana, Mathu Vadalara is one of the much talked about films that is receiving a huge response from the audience and critics alike. The film stars Keeravani’s son Sri Simha in the lead role and his other son Kaala Bhairava as the music composer.

‘మత్తు వదలరా’ నుంచి మరో కొత్త ట్రైలర్

Posted: 12/31/2019 01:04 PM IST
Mathu vadalara gets new trailer after the release

చిన్న సినిమాగా వచ్చి అందరి మన్ననలు పొందిన చిత్రం ‘మత్తు వదలరా’. ఈ సినిమాతో కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ హీరోగా, ఆయ‌న‌ మ‌రో వార‌సుడు కాలభైరవ సంగీత ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యారు. రితేష్‌ రాణా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించాయి. నరేష్‌ అగస్త్య, వెన్నెల కిశోర్‌, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది.

శ్రీ సింహ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఫన్నీ, ఆసక్తికర సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ‘శవాన్ని చూసినా హ్యాపీగా ఉండేవాడ్ని నిన్నే చూస్తున్నాను రా..’ అని శ్రీ సింహను ఉద్దేశించి సత్య అన్న మాటలు నవ్వులు పూయించాయి. దీనికి తోడు సినిమా రిలీజ్ లలో తొలి రివ్యూలు తెలిపే ప్రేక్షకుల పాత్రలో షకలక శంకర్ కామెడీ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mathu Vadalara  Simha  Telugu  Tollywood  SS Rajamouli  KK Keeravani  SS Rajamouli  Tollywood  

Other Articles