Bangalore beauties in bollywood బాలీవుడ్ లో బెంగళూరు ముద్దుగుమ్మల హవా..

Bangalore beauties in bollywood

Bangalore Actresses, Kriti Kharbanda, Pranitha Subhash, Nithya Menen, Tollywood Heroines

Bangalore beauties Kriti Kharbanda and Pranitha Subhash are getting offers in bollywood

బాలీవుడ్ లో బెంగళూరు ముద్దుగుమ్మల హవా..

Posted: 12/26/2019 02:03 PM IST
Bangalore beauties in bollywood

టాలీవుడ్ ముద్దుగుమ్మలందరికి బాలీవుడ్ అంటే ఎందుకో అపారమైన మక్కువ ఎక్కువ.. ఇక్కడ కొన్ని చిత్రాల విజయాల తర్వాత  త తమ నటనను, తమ ప్రతిభను అటు బాలీవుడ్ లో కూడా  పరీక్షించుకోవాలని ఎంతగానో తతహలాడుతుంటారు. .

అలా  వలస వెళ్లిన  కథానాయికల జాబితా  చాలా  పెద్దదే మనం వర్ణించాలంటే..  నాడు  వర్షం ముద్దు గుమ్మ త్రిష నటనతో మనల్ని  అల్లేసింది ..  బాలీవుడ్లో అడుగు  పెట్టి తన నటనను వారికి కూడా పరిచయం చేసింది.. నేడు పార్వతి తన ప్రతిభను పరీక్షించుకున్నే  వేటలో  పడింది.. ఏది ఏమైనా బాలీవుడ్  మాత్రం  మన బెంగళూరు మగువల అందాలకు స్వగతం   ఎంతో ఆత్మీయంగా  పలుకుతుంది.. .

టాలీవుడ్ లో  అచ్చు రాని ముద్దు గుమ్మలు  కూడా బాలీవుడ్ లో ఒక మారు పరీక్షించుకోవాలని  ప్రయత్నించి  సఫలమైన వారు కొందరు..  ఆ కోవకి చెందిన వారే  కృతి కర్బందా మరియు ప్రణీత సుభాష్ . .. అందం -  అభినయం ఉన్న ఈ ఇరువురు తెలుగు చిత్రసీమలో నిలదొక్కుకోలేక పోయారు . అని బాధ  పడక అలా బాలీవుడ్ పై  పయనం సాగించారు.. అభినయం తో మనల్ని అలనాటి సౌందర్యను  గుర్తుకు తెచ్చే నిత్యమీనన్  కూడా  బాలీవుడ్ పై పయనం ప్రారంభించారు..

ఇదిలా ఉంటె బాలీవుడ్ లో  ఇప్పటికే  తమ ప్రతిభ తో  విరాజిల్లుతున్న  దీపికా పదుకొనే   మరియు  అనుష్క శర్మలు కూడా  బెంగళూరు నివాసులే .. దీపికా ముంబై లో  స్థిరపడిన  కన్నడ ముద్దుగుమ్మే ..  అనుష్క  శర్మ   ఢిల్లీ సోయగం.. కానీ బెంగళూరు లో తన చదువు ను సాగించారు.

ఏది ఏమైనా బెంగళూరు ముద్దుగుమ్మాలంతా  అంత కలిసి తమ అందచందాలతో బాలీవుడ్ లో సందడి చేస్తున్నారు..

శ్రీవల్లి.. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Actresses  Kriti Kharbanda  Pranitha Subhash  

Other Articles