'Jai Sena' movie teaser goes viral ‘జై సేన’ టీజర్: శ్రీకాంత్ డైలాగ్స్ వైరల్

Srikanth dialogues over modi and ram mandir goes viral

'Jai Sena' movie, 'Jai Sena' teaser, 'Jai Sena' Srikanth, 'Jai Sena' Sunil, 'Jai Sena' Tarak Ratna, 'Jai Sena' dialogues over Modi, 'Jai Sena' dialogues over Ram Mandir, 'Jai Sena' teaser viral, Srikanth, Sunil, Tarak Ratna, dialogues over Modi, dialogues over Ram Mandir, Samudra, Sai Arun Kumar, Shiva Maha Teja Films, tollywood, movies, entertainment

Another teaser of upcoming Tollywood movie 'Jai Sena' released and went viral on social media. Srikanth played a powerful character and throbbed the hearts of movie lovers with punch dialogues. In dialogue, he said his name is Godse and came to construct the Ram Mandir in Ayodhya.

‘జై సేన’ టీజర్: గాడ్సే, అయోధ్య, మోడీలపై శ్రీకాంత్ డైలాగ్స్ వైరల్

Posted: 12/23/2019 08:43 PM IST
Srikanth dialogues over modi and ram mandir goes viral

హీరో శ్రీకాంత్‌, కామెడీ హీరో సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 2020 ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్ ను ఇవాళ కథానాయకుడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

చిత్ర యూనిట్ దర్శకులు సముద్ర, నటులు కార్తికేయ, ప్రవీణ్‌, శిరీష్‌ రెడ్డి, హరీష్‌, శ్రీనివాస్‌ తదితరుల సమక్షంలో నాగార్జున ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున చిత్ర దర్శకుడు సముద్రకు, చిత్ర యూనిట్ కు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు‌. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ‘జై సేన’.. పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు నాగార్జున టీజర్ ను విడుదల చేశారు. అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన’ అని అన్నారు.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles