Prati Roju Pandage" 3 days box office collections సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజు పండగే’ రాకింగ్ కలెక్షన్స్

Sai tej prati roju pandage 3 days box office collections in swing

Prati Roju Pandage, Prati Roju Pandage 3-day collections, Prati Roju Pandage box office collections, Prati Roju Pandage 1st weekend collections, sai dharam tej, Raashi Khanna, SatyaRaj, Rao Ramesh, Thaman, Maruthi, Bunny Vas, Tollywood, movies, entertainment

Supreme hero Sai Dharam Tej and Raashi Khanna played the lead roles in the movie Maruthi directed the family entertainer that opened well at the box-office. The movie made an amount of 8 crores at the box-office in the first weekend.

సాయిధరమ్ తేజ్ ‘ప్రతి రోజు పండగే’ రాకింగ్ కలెక్షన్స్

Posted: 12/23/2019 07:49 PM IST
Sai tej prati roju pandage 3 days box office collections in swing

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కామెడీని .. ఎమోషన్ ను కలుపుకుని ఈ సినిమా దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీసు వద్ద రాకింగ్ కలెక్షన్స్ ను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది.

తొలి మూడు రోజుల్లో  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 23 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ రోజుతో 25 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టవచ్చని అంటున్నారు. తేజూ కెరియర్లో ఇవి అత్యధిక వసూళ్లని చెబుతున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్ - రావు రమేశ్ పాత్రలు బలమైనవిగా నిలిచాయి. తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న సన్నివేశాలు కీలకంగా నిలిచాయి. తాత .. తండ్రి .. మనవడు .. ఇలా మూడు తరాల వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

ఇక ప్రతిరోజు పండగే తెలుగు రాష్ట్రాల కలెక్షన్ వివరాలను చూస్తే.. నైజాం ప్రాంతంలో కోటి 35 లక్షలు మూడు రోజుల్లో వసూలు చేసింది. సీడెడ్ లో రూ.43 కోట్లు, నెల్లూరులో రూ.10 కోట్లు, కృష్ణాలో రూ, 0.26 కోట్లు, గుంటూరులో రూ. 0.21కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.0.18 కోట్లు, తూర్పు గోదావరిలో 0.21 కోట్లు, ఉత్తరాంధ్రలో 0.42 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజైన అదివారం రోజునే రూ.3.16 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల తొలి వారంతంలో ఈ చిత్రం రూ.8.76 కోట్లను రాబ్టటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prati Roju Pandage  3-day collections  box office  sai dharam tej  Raashi Khanna  SatyaRaj  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh