హీరోయిన్ శ్రీయ గుర్తుందా.? బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణిలో చివరిసారిగా మెరిసిన ఈ భామ.. ఆ తరువాత నుంచి తెలుగు ప్రేక్షకులకు మాత్రం కనిపించలేదు. అయితే ప్రస్తుతం అమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పైగా అమెను గన్ పాయింట్ లో అదుపులోకి తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తల్లో నిజమెంత అని పరిశీలిస్తే.. నిజమే అమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లండన్‌లోని అతి పెద్ద విమానాశ్రయం స్టెన్‌పోర్టులో విమల్, శ్రియ, సత్యన్ నటించిన ‘సందకారి’ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. అప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగిందన్నారు. నటి శ్రియ తెలియకుండా విమానాశ్రయంలోని భద్రతా ప్రాంత సరిహద్దులను దాటి హై సెక్యూరిటీ ప్రాంతంలోకి వెళ్లింది. దీంతో లండన్ భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి అనధికారికంగా ఈ ప్రాంతంలోకి ఎలా వస్తావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారన్నారు. దీంతో బిత్తరపోవడం శ్రియ వంతైందన్నారు.
దీంతో సమస్య జఠిలం అవుతుందని గ్రహించి.. ఆ ప్రాంతానికి కాస్త దూరంగా ఉన్న నటుడు విమల్ వెంటనే పోలీసుల వద్దకెళ్లి తగిన ఆధారాలు చూపి పరిస్థితిని వివరించారు. పోలీసులతో మాట్లాడి వారికి షూటింగ్ డాక్యుమెంట్స్ చూపించారు. దీంతో పోలీసులు శ్రియను చిరునవ్వులో వదిలిపెట్టినట్లు చెప్పారు. ఈ విషయమై శ్రియ నుంచి కానీ యూనిట్ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇకపోతే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘మై బాస్’ సినిమాకు ‘సందకారి’ రీమేక్‌గా రాబోతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more