RRR: Official first look of Jr NTR 'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ కొమురం భీమ్ అఫీషియల్ లుక్.!

Rajamouli s rrr team big update official first look of jr ntr

RRR, RRR update, RRR latest Update, RRR ntr first look, RRR NTR official look, RRR NTR kumaram Bheem role, RRR NTR Kumaram Bheem first look, RRR Telugu, Ram Charan, SS Rajamouli, Jr NTR, Alia Bhatt, Olivia Morris, Ray Stevenson, Alison Doody, tollywood, movies, entertainment

Putting an end to all speculations, and to the photos and videos leaked in the internet, makers of the upcoming Ram Charan and Jr NTR starrer RRR unveiled the official look of Kumaram Bheem role played by young tiger Jr NTR.

'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ కొమురం భీమ్ అఫీషియల్ లుక్.!

Posted: 12/12/2019 05:50 PM IST
Rajamouli s rrr team big update official first look of jr ntr

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జక్కన్న టాలీవుడ్ అగ్ర హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ‌్ తో కలసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని ప్రకటించి మరో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు సంచలనం క్రియేట్ చేశాడు. దీంతో సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కరేజ్ చూపించబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఆడిపాడనున్నారు. ఇక జక్కన్న ఆస్థాన టీం.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే రాజమౌళి అండ్ టీం.. లీకుల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో తెలిసిందే. యూనిట్లో మెబైల్ ఫోన్స్ అస్సలు అనుమతించరు. కనీసం లుక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  విషయంలో మాత్రం ఆయన లెక్కలు తప్పుతున్నాయి. లుక్ కాదు ఏకంగా ఎన్టీఆర్ కొమరం భీం లుక్‌ ఉన్న మేకింగ్ వీడియో బయటకు వచ్చింది. దీంతో యూనిట్ అంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఇష్యూ విషయంలో రాజమౌళి టీంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఎన్టీఆర్ లుక్ ను అఫిషియల్ గా విడుదల చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశాడు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న వేళ, ఆయన లుక్, సన్నివేశాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ అఫీషియల్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తలపాగా, గడ్డంతో సీరియస్ గా చూస్తున్నట్టు ఉన్న ఎన్టీఆర్ లుక్ మరింత వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles