ram charan condolence to Noor Ahmed family అభిమాని కుటుంబానికి మెగా పవర్ స్టార్ అండ..

Hero ram charan donate 10 lakh rupees to noor ahmed family

Ram Charan Tej, Ram Charan, Mega power star, Greater Hyderabad Mega Fans Association, President, Rs. 10 Lakhs, financial aid, Tollywood, movies, Entertainment

Mega Power Star Ram Charan pays condolence to Greater Hyderabad Mega Fans Association President Noor Amhed, also announced 10 lakh financial aid to #NoorBhai's family, says he is in busy in shooting, will meet noor bhai family after arriving to Hyderabad.

అభిమాని కుటుంబానికి మెగా పవర్ స్టార్ అండ..

Posted: 12/09/2019 10:01 PM IST
Hero ram charan donate 10 lakh rupees to noor ahmed family

మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు అందులోనూ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడైన నూర్ అహ్మద్ (55) ఆకస్మిక మరణవార్తతో ఆయన దిగ్బ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్ స్వయంగా వారింటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి వచ్చారు.

అయితే తమ ఇంటి సభ్యుడు ఇక లేడు అన్న విషయం తెలుసుకున్న మెగాహీరోలు చిరంజీవి, అల్లు అర్జున్‌, నిర్మాత అ‍ల్లు అరవింద్‌ తదితరులు కలిసి అయన నివాసానికి వెళ్లి నూర్‌ అహ్మద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాజాగా మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాకుండా 10 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. హైదరాబాద్ కి రాగానే అభిమాని కుటుంబాన్ని కలుస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ మెగా అభిమానులలో నూర్‌ అహ్మద్‌ ప్రముఖుడని అన్నారు. నూర్ అహ్మద్ మరణ వార్త వినగానే చాలా చలించిపోయా.. గతంలో ఆయనకి ఆరోగ్యం బాగులేని సమయంలో తాను అసుపత్రికి వెళ్లి పరామర్శించానని చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని చేయించినా.. ఆయన ఇంత త్వరగా తమకు దూరం అవుతారని అనుకోలేదని అన్నారు. నూర్‌ బాయ్ మా పుట్టినరోజు వేడుకల సమయంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఆయన లేని లోటు మాకు ఎప్పుటికీ తీరనిదేనన్నారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని, అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles