actress Anjali Ameer face death threat నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

Transgender actress anjali ameer face death threat

Peranbu, Kozhikode, Koduvally, Anjali Ameer, actress, acid throwing, live-in relationship, partner, Mollywood, Tollywood, Movies, Entertainment

Transgender actor Anjali Ameer of ‘Peranbu’ fame has alleged that she is facing threat to her life and also threat of acid attack from her partner with whom she has been in a live-in relationship.

నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

Posted: 12/05/2019 06:31 PM IST
Transgender actress anjali ameer face death threat

అంజలి అమీర్‌.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడి నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెను వేధింపులకు గురించేస్తున్నాడని వివరించారు. అంజలి అమీర్‌ గతకొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు.

అయితే ఆ వ్యక్తి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారని అంజలి ఇటీవల ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా అభిమానులకు తెలిపారు. ‘ఆ వ్యక్తి నన్ను మోసం చేసి సహజీవనం చేసేలా చేశాడు. అతను మంచివాడు కాదని తెలిసింది. వెంటనే అతన్ని వదిలేయాలనుకున్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నా మీద యాసిడ్‌ దాడి చేస్తానని అంటున్నాడు. నేను కొంతకాలంగా నా బ్యాంకు ఖాతాలో రూ.4లక్షలను పొదుపు చేసుకున్నాను. రెండు సంవత్సరాల నుంచి అతను ఆ డబ్బును కూడా వాడేసుకున్నాడు.’ అని అంజలి తెలిపారు.

అతని వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు బతుకు మీదే ఆశ కరువైందని అమె బాధను వ్యక్తం చేశారు. తన జీవితాన్నే ఆధారంగా చేసుకుని ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు అంజలి ఇటీవల ప్రకటించారు. ఆమె ఏవిధంగా నటిగా మారింది. ఆమె ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈసినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలో అమె తన సహజీవనం చేసిన వ్యక్తి చేతిలో చిత్రవధను అనుభవిస్తోందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles