Biggies influence Sanjana to withdraw case ‘దిశ’ ఘటనపై ఖండన.. సంజనపై ఒత్తిడి..

Tollywood mourns disha case but not stands with sanjana

Disha, Ashish Goud, molestation, Sanjana, Bigboss, bigboss telugu season 2, Tollywood celebs, pub, actress, political biggies, Influence, Patancheru, Hyderabad, Tollywood, Crime, movies, Entertainment

Tollywood too has taken aback by the rape and murder of Disha. But the same industry is not standing behind Actress Sanjana in the same sexual assault. Ashish Goud the son of former MLA Nadishwar Goud had molested her in a famous pub at Banjara Hills

‘దిశ’ ఘటనపై ఖండన.. సంజనపై ఒత్తిడి..

Posted: 12/05/2019 05:42 PM IST
Tollywood mourns disha case but not stands with sanjana

డాక్టర్ దిశ హత్యాచారం ఉదంతం యావత్ దేశంలో సంచలననాన్ని రేకెత్తించగా, దీనిపై మన తెలుగు సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని వుంటే అంటూ విమర్శలు కూడా చేశారు. ఇంతవరకు బాగానే వున్నా.. అలాంటి ఘటనను అదే సినీపరిశ్రమకు చెందిన సహచర నటి ఎదుర్కోంటే మాత్రం కనీసం స్పందించడం లేదు. కేవలం మీడియాలో లేక సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తే సరిపోతుందని వీరు భావిస్తున్నారా.? అంటే ఔనని చెప్పక తప్పదు.  

దిశ ఘటన జరిగిన రోజునే రెండు ఘటనలు సంభవించాయి. అందులో ఒకటి వరంగల్ లో మరోకటి హైదరాబాదులో. వరంగల్ లో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ హైదరాబాదులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఆ తరువాతే బాధితురాలికి మానసిక ఒత్తిడి పెరిగింది. ఈ ఘటనలో బాధితురాలు మరోవరో కాదు.. సినీ పరిశ్రమకు చెందిన నటి, బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్.. సంజన. హైదరాబాద్ లోని ఓ పబ్బులో తనతో ఓ  యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని అమె పోలీసులకు పిర్యాదు చేసింది.

అయితే ఆ యువకుడు ఎవరని ఆరా తీసిన పోలీసులకు తాను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ అని నిందితుడు చెప్పడంతో.. పోలీసులు కూడా కొంత వెనక్కుతగ్గారు. అయితే అదే రోజున దిశ ఘటన నేపథ్యంలో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు.. ఇక తమ పని పూర్తైందన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అశీష్ గౌడ్ తో రాజీ చేసుకోవాలని కొందరు రాజకీయ నాయకుల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీంతో తనకు మానసిక ఒత్తిడికి గురవుతున్నానని బాధితురాలు పేర్కోంది.

అయినా, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సినీ నటి స్పష్టం చేసింది. ఇక పోలీసులు సైతం చర్యలు తీసుకోవడం లేదని అమె ఆరోపించారు. పబ్ లోని సిసీటీవీ ఫూటేజీలను పరిశీలించాలని తాను సూచించినా పోలీసులు ఆ పని చేయలేదని బాధితురాలు అరోపించారు. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తనను సంప్రదించి, రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. నోవాటెల్ హోటల్ పబ్ లో తన పట్ల ఆశీష్ అమర్యాదగా ప్రవర్తించాడని, మొదటి అంతస్తుపై నుంచి తోసేయడానికి ప్రయత్నించాడని కూడా అరోపించారు.

ఇదిలావుండగా, నిర్భయ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా చాలా పెరిగిపోతున్న ఈ తరుణంలో.. పట్టణాలు, నగరాల విషయాన్ని పక్కనబెడితే.. గ్రామీణ ప్రాంతాల్లో కుల పంచాయితీలు, పంచాయితీ పెద్దలు కూడా జోక్యం చేసుకుని శీలానికి ఖరీదు కట్టిన ఘటన వెలుగుచూశాయి. అంతేకాదు.. బాధితులకే జరిమానాలు విధించిన ఘటనలు వున్నాయి. బాధితురాలి కుటంబాలను గ్రామ బహిష్కరణ చేసిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. దీనికి తోడు బలవంతంగా రాజీ కుదిర్చిన ఘటనలతో పాటు బాధితురాలిని, నిందితుడు పెళ్లి చేసుకున్న ఘటనలు తెరపైకి వచ్చాయి.

దీంతో అత్యాచార కేసుల్లో బాధితురాలు రాజీ కుదర్చుకున్నా అది చెల్లదంటూ.. కేసు కొనసాగుతుందంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం రూలింగ్ ఇచ్చిన విషయం సంజనపై ఒత్తిడి తెస్తున్న పెద్దలు మర్చిపోయినట్టు వున్నారు. ఇక బాధితురాలు తనకు అన్యాయం జరిగింది.. అత్యాచార యత్నం చేయబోయాడు అని చెప్పినా.. సినీ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ అమెకు మద్దతుగా నిలవడం లేదు. సంజనకు అండగా మేమున్నాం.. ఎందుకని కేసును ఉపసంహరించుకోవాలి.? అంటూ నినదించే గొంతు వినబడటం లేదు. పైగా అమెను రాజీ కుదర్చుకోమ్మని అదే పరిశ్రమకు చెందిన పెద్దలు ఒత్తడి తేవడం.. లోకం తీరును చెప్పకనే చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha  Ashish Goud  molestation  pub  actress  political biggies  Influence  Patancheru  Hyderabad  Tollywood  Crime  movies  Entertainment  

Other Articles