మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత తెరకెక్కుతున్న మూడవ చిత్రంలో నటించేందుకు చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారు. సామాజిక సృహ వున్న దర్శకుడు.. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో జోడించి తీస్తూ అప్రతిహాత విజయాలను నమోదు చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లగానే జరిగి వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
రెగ్యూలర్ షూటింగ్ సంబంధించి సన్నాహాలు చకచకా జరిగిపోతున్న క్రమంలో చిత్ర నిర్మాత రాంచరణ్ తేజ్.. ఒక్క విషయంలో ఇబ్బందిపడుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించేందుకు కొత్తముఖాన్ని ఆయన అన్వేషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి త్రిష ఎంపికైందని, అయితే పలు కారణాల నేపథ్యంలో అమెపై విముఖత వ్యక్తం చేసిన రాంచరణ్.. తాజగా మరో కొత్త ముఖం కోసం వెతుకుతున్నారని సమాచారం. అనుకున్నట్లుగానే హీరోయిన్ పార్టును పక్కనబెట్టి మిగతా షెడ్యూల్ తో ముందుకుసాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జూలై నాటికి అన్ని పనులు పూర్తిచేసి, ఆగస్టు 14న చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో కొరటాల వుండగా.. ఈ చిత్రానికి అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దాదాపు అదే డేట్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాచీన దేవాలయాలు .. ఆ దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more