కాలీవుడ్ హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రం విడుదల ఒక సంచలనంగా మారింది. చిత్రానికి సంబంధించి స్పెషల్ షోలు వేయలేదని ఆయన అభిమానులు హద్దులు దాటి మరీ తమిళనాడులో బీభత్సం సృష్టించారు. వారిలో కొందరినీ సిసి కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బిగిల్’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తెలుగులో విజిల్ (తమిళంలో ‘బిగిల్’) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక మరోవైపు ఈ చిత్రం విడుదైలన తరువాత కలెక్షన్లు వసూళ్లు కూడా మరో సంచలనానికి తెరలేపాయి. విడుదలైన ఆరు రోజుల వ్యవధిలోనే 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది ఈ చిత్రం. ఈ చిత్రంలో హీరో విజయ్ కి వున్న ఫాన్ ఫాలోయింగ్.. ఆయన నటించేందుకు అంగీకరించే చిత్ర కథ ఎంపికకు మరోమారు దర్ఫణం పట్టింది. అయితే ఈ చిత్రం నిడివి తాజాగా తగ్గింది. చిత్ర నిడివిని తగ్గించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది చిత్ర యూనిట్.
చిత్రంలో ఓ అమ్మాయి ఆకారాన్ని హేళన చేస్తూ కథానాయకుడు విజయ్ మాట్లాడిన మాటల సన్నివేశాన్ని తొలగించారు. విజయ్ అలా మాట్లాడడం కథానాయకుడి వ్యూహం. అలా రెచ్చగొడితే వారిలో పట్టుదల పెరుగుతుందని, తద్వారా విజయం సాధించవచ్చనేది హీరో ఆలోచన. అయితే, అమ్మాయి ఆకారంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీంతో ఈ కారణంగా సినిమాపై వ్యతిరేక ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఆ సీన్‌ను తొలగించారు. దీంతో పాటు మరికొన్ని సీన్లను కూడా కట్‌చేసి బాగా ఎక్కువగా ఉన్న సినిమా నిడివిని తగ్గించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more