Meeku Mathrame Cheptha censor review ‘మీకు మాత్రమే చెప్తా’తో అక్క.. రా బాబోయ్: అనసూయ

Meeku mathrame cheptha ready to release after censor clearance

Vijay Devarakonda, Meeku Mathrame Cheptha, King Of The Hill production, tharun bhascker, Abhinav gomatam, Vani bhojan, Anasuya Bharadwaj, Shammer Sultan, Tollywood, censor review, Tollywood, movies, entertainment

After the release of Hero Vijay Devarakonda's debut production venture Meeku Matrame Chepta which is releasing on his King Of The Hill production banner on November 1st my fans will be hurted says Anasuya Bharadwaj. This leaves her fans in shock

‘మీకు మాత్రమే చెప్తా’తో అక్క.. రా బాబోయ్: అనసూయ

Posted: 10/31/2019 07:47 PM IST
Meeku mathrame cheptha ready to release after censor clearance

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ స్థాపించిన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అనసూయ తన క్యారెక్టర్ ను రివీల్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫాన్స్ ఆగ్రహంతో అమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాను నటుడిగా ఇప్పటివరకు సంపాదించినదంతా ఈ చిత్రం కోసమే ఖర్చు చేశానని చెప్పినా.. వినిపించుకోకుండా అనసూయ తన పాత్రను రివీల్ చేసిందని అమెపై మండిపడుతున్నారు.

అసలేం జరిగిందీ అంటే ఈ చిత్రం విడుదలైన తరువాత తనను అక్క అని పిలుస్తారని అమె సరదాగా తన ఫ్యాన్స్ తో చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో అందర్నీ తన నటనతో అనసూయ మెప్పించింది. అయితే తాజాగా ‘మీతో మాత్రమే చెబుతా’ చిత్రంలో నటించిన ఆమె తన పాత్ర ఏంటో అభిమానులకు అడగకుండానే చెప్పేసింది. తనది ఓక స్ట్రిక్ట్ అక్క పాత్ర అని రివీల్ చేసింది.

అనసూయ స్పీచ్ స్టార్ట్ చేస్తుండగా... ఒక్కసారిగా ఆమె అభిమానులంతా ఈలలు కేకలు, అరుపులతో సందడి చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు సినిమా విశేషాలు చెబుతూ అనసూయ..కోన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రంగస్థలం సినిమా తర్వాత నన్ను చాలామంది రంగమ్మత్త అని పిలిచారని... అయితే  మీకు మాత్రమే చెబుతా సినిమా తర్వాత .. నన్ను మీరంతా అక్కా అని పిలివాల్సి వస్తుందేమోనని అంటూ మాట్లాడారు. దీంతో అక్కడున్న అనసూయ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles