war episode in Sye Raa is making buzz చిరంజీవి ‘సైరా’ లో యుద్ద సన్నివేశమే హైలైట్.!

Chiranjeevi s sye raa team gives gift to mega fans

Sye Raa pre-release business,Sye Raa Narasimha Reddy,Chiranjeevi,Chiru,Sye Raa theatrical rights prices,Ram charan,Sye Raa satellite rights prices,Sye Raa digital rights prices,Sye Raa audio rights prices,Sye Raa area wise rights, Sye Raa distribution rights prices, Tollywood, Entertainment, Movies

The Sye Raa buzz is on and how! The film which is just eight days away from its release is already one of the most talked-about films of the recent times-giving goosebumps to all with each passing day.

చిరంజీవి ‘సైరా’ లో యుద్ద సన్నివేశమే హైలైట్.!

Posted: 09/24/2019 08:18 PM IST
Chiranjeevi s sye raa team gives gift to mega fans

రేనాటి వీరుడు, తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా నిలిచే 'సైరా నరసింహారెడ్డి' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ అందింది. ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు. నోస్సం ఫోర్ట్ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. దేశ విదేశాలకి చెందిన ఆర్టిస్టులు .. ఫైటర్స్ కలుపుకుని 2000 మందితో, 35 రాత్రుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా చిత్రీకరించినట్టుగా చెప్పారు.

రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సన్నివేశం ఉంటుందని చెబుతున్నారు. నయనతార, తమన్నా కథానాయకులు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మాత. కాగా, ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసిన విషయం తెలిపిందే. ఈ చిత్రానికే హైలైట్ గా నిలిచే సన్నివేశంలో మెగాస్టార్ ఏ స్థాయిలో విజృంభించారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sye raa  Chiranjeevi  sye raa title song  Ram charan  surender reddy  Tollywood  

Other Articles