vijay Bigil also draws controversy విజయ్ బిగిల్ (విజిల్)కు రాజుకున్న కాంట్రావర్సీ.!

Meat shop owners warns actor vijay on release of bigil

Vijay, Nayanthara, Atlee, Bigil, meat shop owners, coimbatore, Tamil Nadu, Politics, kollywood, movies, entertainment

Bigil is one of the highly-anticipated upcoming film staring Thalapathy Vijay, Directed by Atlee, the film has run into a controversy as members of the Tamil Nadu Meat Shop Owners association in Coimbatore have issued a statement criticizing the first look poster.

విజయ్ బిగిల్ (విజిల్)కు రాజుకున్న కాంట్రావర్సీ.!

Posted: 09/24/2019 11:04 AM IST
Meat shop owners warns actor vijay on release of bigil

బిగిల్‌ ( విజిల్, ఈల) చిత్రంపై వివాదం ఆరంభమైంది. తమిళనాట క్రేజీ కాంబో గా తెరకెక్కుతున్న బిగిల్ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భీభత్సమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే బిగిల్ దర్శకుడు అట్లీ తో హీరో విజయ్ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ మూడు సినిమాలు తమిళనాట కాంట్రవర్సీ రాజేయడం గమనార్హం. దీంతో తాజాగా నటుడు విజయ్‌ నటించే ప్రతి చిత్రానికి వివాదం తలెత్తడం మామూలైంది. పంచాయితీలు, కేసులు, కోర్టులు, ప్రభుత్వం వరరూ ఈ వివాదాలు వెళుతున్నాయి.

విజయ్, అట్లీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం బిగిల్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్‌లో చెపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్‌ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై కలెక్టర్‌ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు. అందులో తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నటుడు విజయ్‌కు తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.

మత్య్స, మాంస వ్యాపారులు తమ వృత్తిని ప్రారంభించే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారన్నారు. అలాంటి కత్తులపై నటుడు విజయ్‌ కాలు పెట్టి కూర్చున్న దృశ్యంతో కూడిన బిగిల్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను విడుదల చేశారన్నారు. ఇది మత్స్య, మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించేలా ఉందన్నారు. ఈ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించాలని లేదంటే.. తమ ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Nayanthara  Atlee  Bigil  meat shop owners  coimbatore  Tamil Nadu  Politics  kollywood  

Other Articles