High Court Clears Lakshmi's NTR Release ‘లక్ష్మీస్’ చిత్రాల విడుదలకు.. హైకోర్టు పచ్చ జెండా

Telangana high court clears route for lakshmi s ntr release

lakshmis' NTR, Lakshmis veera grandham, ram gopal varma, kethireddy jagadishwar reddy, High court,, tollywood, movies, entertainment

A petition was filed in the Telangana High Court to stop the release of Ram Gopal Varma's Lakshmi's NTR which is a controversial take on NTR's final days.

‘లక్ష్మీస్’ చిత్రాల విడుదలకు.. పచ్చ జెండా ఊపిన హైకోర్టు..

Posted: 03/19/2019 05:21 PM IST
Telangana high court clears route for lakshmi s ntr release

దివంగత నేత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేయడంలో చతికిలపడ్డాయి. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరెన్ని రకాలుగా విమర్శించినా తాను అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తానని తెగేసి చెప్పేశాడు అర్జీవి.

ఈ మేరకు మొదట మార్చి 22ను విడుదల తేదీగా ప్రకటించాడు. అయితే ఈ తేదీ విషయంలో సెన్సార్ బోర్డు జోక్యంతో దానిని మార్చి 29కి వాయిదా వేశాడు. ఇక ఇదే సమయంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందిన లక్ష్మీస్ వీరగ్రంధం చిత్రం కూడా విడుదలకు సన్నాహలు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాల విడుదలను వెంటనే నిలిపి వేయాలని.. వీటి ప్రభావం తెలుగు సినీ ప్రేక్షకులపై పడి.. తద్వారా త్వరలో రానున్న ఎన్నికలపై కూడా పడతుందని పేర్కొంటూ ఓ వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.

ఎన్నికలు సమీపిస్తున్న ఈ వేళ ఇలాంటి సినిమాలు విడుదల చేయొద్దని, వీటి ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ పిటిషన్‌ని పరిశీలించిన హైకోర్టు దానిని కొట్టివేసింది. ప్రతివ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు సినిమా విడుదలను ఆపే అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించగా, ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చిత్రాన్ని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles