Rashmika's maiden Tamil film launched కార్తీతో కలసి పూజా కార్యక్రమానికి రష్మిక

Karthi rashmika mandanna new movie starts with a pooja

rashmika mandanna, vijay deverakonda, Karthi, Geetha Govindam, rashmika mandanna Tamil debut, siruthai, dhilip subbarayan, maanagaram, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment, tollywood

Geetha Govindam heroine Rashmika Mandanna, has signed her first film in Tamil opposite Karthi in a yet-untitled project produced by SR Prakash Babu and SR Prabhu of Dream Warrior Pictures attended puja programme.

కార్తీతో కలసి పూజా కార్యక్రమానికి రష్మిక

Posted: 03/13/2019 10:17 PM IST
Karthi rashmika mandanna new movie starts with a pooja

'ఛలో, గీత గోవిందం' లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మందన తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసింది. కార్తీ హీరోగా చేస్తోన్న కొత్త సినిమాలో రష్మిక నటిస్తోంది. ఈరోజే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 'రెమో' ఫేమ్ బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం గీతాగోవిందం చిత్రం బ్యూటీ చేతిలో రెండు మూడు తెలుగు సినిమాలు వున్నాయి.

ఈ సినిమాలు తన క్రేజ్ ను మరింతగా పెంచుతాయని భావిస్తోన్న రష్మిక.. అదే సమయంలో అటు తమిళంలోను తన ఎంట్రీని ఖారారు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న ఈ భామ కార్తీతో కాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. ఇవాళ జరిగిన చిత్రం పూజా కార్యక్రమానికి కూడా హాజరయ్యింది.

'దేవ్' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, తదుపరి చిత్రంపైనే ఆశలు పెట్టుకున్న కార్తీ కూడా ఈ చిత్రం పూజా కార్యక్రమాలకు హాజరయ్యాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఇక త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 'రెమో' భారీ విజయాన్ని సాధించడంతో భాగ్యరాజ్ కన్నన్ చిత్రంపైనే అటు కార్తీ, ఇటు రష్మికలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అల్ ది బెస్ట్ చెప్పేద్దామా.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashmika mandanna  Karthi  Tamil debut  pooja  siruthai  dhilip subbarayan  kollywood  tollywood  

Other Articles