Nag Ashwin questions KTR on Government hospitals ప్రభుత్వాసుపత్రి అంటే చావుకు పర్యాయపదమా.? నాగ్ అశ్విన్

Mahanati director nag ashwin questions ktr on government hospitals

nag ashwin, mahanati, gandhi hospital, KTR, negligence of staff, TRS Government, cameramen, government hospital, Hyderabad

Mahanati director Nag Ashwin took to Twitter to lash out at KTR and TRS government after the sudden death of one of his friends due to the negligence and short staff at Gandhi Hospital in Hyderabad.

ప్రభుత్వాసుపత్రి అంటే చావుకు పర్యాయపదమా.? నాగ్ అశ్విన్

Posted: 11/27/2018 05:59 PM IST
Mahanati director nag ashwin questions ktr on government hospitals

మహానటి సినిమా దర్శకుడు నాగ్ ఆశ్విన్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలకు పోతూ ప్రజలకు ఎన్నో చేశామని.. ఎన్నికల మానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నేరవేర్చామని చెబుతూ ఓ వైపు ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నా.. ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన ప్రజల ఆరోగ్యం మాత్రం గాల్లో దీపంగా మారిందన్నది వాస్తవం. ఇక్కడ అసుపత్రి డాక్టర్లకు, సిబ్బందికి పేషంట్లు, వారి కుటుంబసభ్యులు ఏటీయం కేంద్రాలుగానే కనబడతారన్న విమర్శలు కూడా వున్నాయి.

ఏడాది క్రితం పుట్టిన శిశువులకు కూడా వైద్యం అందిచలేక.. అనేక మంది శిశువుల మరణానికి కూడా ఉమెన్స్ అసుపత్రి నెలవుగా మారింది. ఇక తాజాగా ఇదే విషయంలో తానెం చేయాలో చెప్పాలని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్.. నేరుగా తెలంగాణ మంత్రి కెటిఆర్ కు ట్యాగ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన మిత్రుడు సినీ ప్రపంచంలోనే అత్యుత్తమ కెమెరామెన్ అని ఆయన మరణ తనను చాలా భాదించిందని.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందక ఆయన మరణించాడని నాగ్ అశ్విన్ తన గోడు వెల్లబోసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే మహానటి సినిమాలో కెమెరామెన్‌గా పనిచేస్తున్న దర్శకుని స్నేహితుడికి ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కెమెరామెన్‌ను హుటా హుటినా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అక్కడ సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కెమెరామెన్ మృతిచెందాడు. ప్రభుత్వాసుపత్రుల తీరు ఎప్పటికి మారుతుందని తన అక్రందనను వెలిబుచ్చాడు. ఎందుకు అంటే..

తన స్నేహితుడిని పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. సిబ్బంది లేకపోవడంతో తన స్నేహితుడ్ని ఆయన తల్లిదండ్రులే స్ట్రేచ్చర్ పై తీసుకెళ్లారన్ని చెప్పారు. మూడు గంటలపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో ఒక్కరు కూడా అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. అక్కడ డాక్ట‌ర్లు ఎవ‌రూ అందుబాటులో లేరని కూడా పేర్కోన్నారు.

స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క తన స్నేహితుడు చ‌నిపోయాడని దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు. అక్కడ మూడు గంటల పాటు తన స్నేహితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడని చెప్పాడు. ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి అంటూ కేటీఆర్‌ ను ప్రశ్నించాడు. ఈ దారుణం గురించి ఎవ‌ర్ని ప్ర‌శ్నించాలో తెలియ‌క మీకే చెబుతున్నాని పేర్కోన్నాడు. ఇక‌పై ఎవ‌రూ ఇలా వైద్యం అంద‌కుండా ఎవ్వరూ చనిపోకూడదు అని పోస్టులో రాసుకొచ్చాడు అశ్విన్‌. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని చూసి రిప్లై ఇచ్చే కేటీఆర్.. ఈ విష‌యంపై మాత్రం ఇంకా స్పందించాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nag ashwin  cameraman  mahanati  gandhi hospital  KTR  negligence of staff  TRS  

Other Articles