Gayathri Raghuram different story on drunken driving ఇలాంటి అరోపణలపై జంకేదేలేదు: నటి గాయత్రి

Actor gayathri raghuram denies drunk driving allegations

bigg boss news, cinema news, drunken driving, gayathri raghuram drunk and drive, gayathri raghuram drunk and drive story, gayathri raghuram drunken driving news, gayathri raghuram news, latest cine updates, movies, entertainment, kollywood, tollywood

Actor Gayathri Raghuram has issued a statement on the drunken driving controversy. Reports earlier suggested that the actress was booked under drunken driving case but she has a different story.

డ్రంక్ అండ్ డ్రైవ్ అరోపణలపై స్పందించిన నటి

Posted: 11/27/2018 04:57 PM IST
Actor gayathri raghuram denies drunk driving allegations

ఈ మద్యకాలంలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో నటీనటులు, సెలబ్రిటీలు అడ్డంగా బుకవుతున్న విషయం చూస్తున్నాం. ఈ తనిఖీలలో పోలీసులు ఒక సెలబ్రిటీని అపితే చాలు.. దానికి కొండంత ప్రచారాన్ని మీడియా చేసేస్తుంది. అందులో నిజమెంతో తెలియకుండానే ప్రచారాన్ని రక్తికట్టిస్తుంది. అయితే అలాంటి ప్రచారానికి తాను ఎట్టి పరిస్థితుల్లో జంకేదే లేదని నటి గాయత్రి రఘురాం తేల్చిచెబుతున్నారు. అసలు జరిగింది తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారని అరోపిస్తున్నారు.

గత శనివారం అర్ధరాత్రి అమె పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఎదుర్కోన్నారు. అయితే మద్యం మత్తులో కారు నడుపుతూ అడయారులో పోలీసులకు పట్టుబడి వారితో వాగ్వాదానికి దిగిన విషయం కలకలం సృష్టించింది. రూ.3,500 జరిమానా కూడా చెల్లించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై గాయత్రి రఘురాం తాజాగా ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. అందులో ఏదో  ఉన్నట్టుగా తనపై అసత్య ప్రసారం చేస్తున్నారు. వాటికంటే తనకు తన ఆత్మాభిమానం, జీవితం ముఖ్యమని పేర్కోన్నారు.

ఈ సందర్భంగా నిజానికి జరిగిందేమిటంటే.. అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని తెలిపారు. షూటింగ్‌ ముగించుకుని సహ నటీనటులను వారి ఇంటికి చేర్చాను. తరువాత ఒంటరిగా కారులో మా ఇంటికి వెళ్లుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు సాధారణ సోదాలు జరిపారు. అయితే నా డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతర పత్రాలు వేరు జేబులో ఉండిపోవడంతో వాటిని పోలీసులకు చూపలేకపోయాను. అయినా నేను కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ వస్తే మద్యం మత్తులో ఉంటే పోలీసులు ఎలా కారు నడపడానికి అనుమతిస్తారు? నా గురించి ఎలాంటి ప్రచారం జరిగినా భయపడేది లేదని ఆమె పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gayathri raghuram  drunk and drive  denies allegations  kollywood  

Other Articles